కన్నడ వాళ్ళు మళ్లీ రష్మిక పై ఫైర్ అవుతున్నారు!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కి వివాదాలు కొత్తేమి కాదు. ఆమె తన తొలి కన్నడ సినిమాతోనే సెన్సేషన్ అయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ [more]

Update: 2019-07-25 03:35 GMT

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కి వివాదాలు కొత్తేమి కాదు. ఆమె తన తొలి కన్నడ సినిమాతోనే సెన్సేషన్ అయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ హీరో ని లవ్ చేసి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తరువాత ఆమెకు తెలుగు లో వరస ఆఫర్లు రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక్కడ సినిమాలు చేస్తున్న టైములో ఆమె తన లవ్ స్టోరీ కి బ్రేక్ అప్ చెప్పేసింది.

గీత గోవిందం సినిమాలో లిప్ లాక్ లీక్ సంచలనం రేపింది. అప్పటిలోనే రష్మిక వీటిని చాలా లైట్ గా తీసుకుంది. రీసెంట్ గా ఆమె కన్నడ సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదని తెలుగు – తమిళాల్లో ఎక్కువ పారితోషకం లభిస్తుంది కాబట్టి ఆ సినిమాలకే ఆమె ఓకే చెబుతుందని ఆమె పై కన్నడీగులు వాపోయారు. కానీ రష్మిక కన్నడ సినిమాలకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా చెప్పింది.

ఇక కొన్ని రోజులు కిందట రష్మిక మందన్న డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ కోసం కర్ణాటక కి వెళ్ళింది. రష్మిక తను కన్నడలో మాట్లాడలేకపోతున్నట్టుగా వ్యాఖ్యానించింది. అంతే దానిపై దుమారం రేగుతోంది అక్కడ. తన మాతృ బాషా అయినా కన్నడ లో ఎందుకు రష్మిక మాట్లాడట్లేదు అని అక్కడ వారు ప్రశ్నిస్తున్నారు. ఇవి కూడా చాలా లైట్ గా తీసుకుని తన పని తానూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నిజంగానే రష్మిక ఎందుకు అలా మాట్లాడిందో ఆమెకే తెలియాలి. ఇక ఆమె నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం రేపు రిలీజ్ కానుంది.

Tags:    

Similar News