RC15 లో రష్మిక రోల్ అదేనా?

రష్మిక.. ఇప్పడూ ఏ నోటా విన్నా ఈమె పేరే వినిపిస్తుంది. లక్కీ హీరోయిన్ గా చాలా తక్కువ టైం లో స్టార్ డం సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు [more]

Update: 2021-04-16 06:36 GMT

రష్మిక.. ఇప్పడూ ఏ నోటా విన్నా ఈమె పేరే వినిపిస్తుంది. లక్కీ హీరోయిన్ గా చాలా తక్కువ టైం లో స్టార్ డం సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ జెండా పాతడానికి రెడీ అవుతుంది. అక్కడ మూడు సినిమాలతోను, అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ తోనూ రష్మిక కెరటంలా ఎగిసిపడుతుంది. స్టార్ హీరోల చూపు అటు పూజ హెగ్డే లేదంటే ఇటు రష్మిక అనే రేంజ్ లోకి రష్మిక వచ్చేసింది. తెలుగులో శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జొహార్లు మూవీలో నటిస్తున్న రష్మికకి శంకర్ – రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ తగిలింది అని, ముందు కియారా అద్వానీని అనుకున్నా.. ఇప్పుడు ఆమెని కొరటాల శివ ఎన్టీఆర్ కోసం లాక్ చెయ్యడంతో.. రామ్ చరణ్ సరసన ఫ్రెష్ గా రష్మిక అయితే బావుంటుంది అని దర్శకుడు శంకర్ అనుకుంటున్నారట.

రష్మిక అయితే అటు తెలుగు, ఇటు తమిళ్, కన్నడ, హిందీ భాషలకు క్రేజ్ ఉంటుంది అని, ఆమె అయితే రామ్ చరణ్ పక్కన జోడిగా సరిగా సరిపోతుంది అని మేకర్స్ ఆలోచనట. అయితే ఇంకా రష్మిక – రామ్ చరణ్ జోడిగా ఫైనల్ అయ్యిందో లేదో తెలియదు కానీ.. శంకర్ – రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీలో రష్మిక జర్నలిస్ల్‌గా కనిపించనుందట. మరి రష్మిక జర్నలిస్ట్ గా రామ్ చరణ్ కి సహాయం చేసే పాత్రలో కనిపిస్తుంది అంటూ అప్పుడే ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి చరణ్ సరసన ఫైనల్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా ఫైనల్ అవుతుందో లేదంటే ఇదే న్యూస్ నిజమై రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అవుతుందో చూద్దాం.

Tags:    

Similar News