రష్మిక, చరణ్ సరసన ఛాన్స్ ఉందంటారా?

ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక యవ్వారం మాములుగా లేదు. నాలుగు భాషలను మ్యానేజ్ చేస్తూ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతుంది. కన్నడ, తెలుగు, తమిళ, [more]

Update: 2021-02-20 09:19 GMT

ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక యవ్వారం మాములుగా లేదు. నాలుగు భాషలను మ్యానేజ్ చేస్తూ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతుంది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినిమాల షూటింగ్స్.. ఇలా ఉంది రష్మిక సినిమాల జోరు. ఛలో తో సింపుల్ గా టాలీవడో కి అడుగుపెట్టి అల్లు అర్జున్ తో పాన్ ఇండియా లెవల్ కి పెంచుకుంది క్రేజు. రష్మికకి అదృష్టం అరమందంతో కొట్టుకుంటుంది. అందుకే పాప దూసుకుపోతుంది. బాలీవుడ్ లోను రష్మిక మూడు నాలుగు సినిమాలతో బాగా బిజీగా మారిపోయింది. అయితే ఇప్పుడు రష్మిక పేరు రామ్ చరణ్ తో కలిసి వినబడుతుంది. అంటే దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం RC15 లో రామ్ చరణ్ జోడిగా రష్మిక పేరు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు.
అయితే రామ్ చరణ్ తో శంకర్ సినిమాలో రష్మిక నటించే సీన్ ఉంది అని అనుకోవడం లేదు జనాలు. అంటే శంకర్ కి మాములుగా తమిళంలో తెరకెక్కించే సినిమాలకే బాలీవుడ్ హీరోయిన్స్ ని పట్టుకొస్తాడు. రోబో కి ఐష్ ని, ఐ కి అమీ జాక్సన్ ని ఇలా హీరోయిన్స్ విషయంలో అస్సలు తగ్గడు శంకర్. కానీ ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో శంకర్ రష్మిక పై ఫోకస్ పెడతాడా? ఏమో డౌటే?. బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్స్ ని రామ్ చరణ్ కోసం సెలెక్ట్ చేస్తాడు. భారీ బడ్జెట్ మూవీ కదా హీరోయిన్స్ కి కోట్లలో ఖర్చు పెట్టిస్తాడు కానీ శంకర్ ఆ విషయంలో మాత్రం తగ్గడు అనిపిస్తుంది. మరి ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శకుడు శంకర్ ని నిర్మాత దిల్ రాజు తట్టుకోగలడా? అనే అనుమానం మొదలైంది. ఇకపోతే రామ్ చరణ్ తో రశ్మికకి అవకాశమనే అదృష్టం శంకర్ కలిపిస్తాడో.. లేదో.. చూద్దాం.

Tags:    

Similar News