రవితేజ భలే ఖిలాడీలే!!

రవితేజ కి వరసగా అట్టర్ ప్లాప్స్ ఉన్నప్పటికీ.. సినిమాలకు గ్యాప్ తీస్కోడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ ఏజ్ లోను యమా ఎనేర్జిటిక్ గా [more]

Update: 2020-05-29 10:36 GMT

రవితేజ కి వరసగా అట్టర్ ప్లాప్స్ ఉన్నప్పటికీ.. సినిమాలకు గ్యాప్ తీస్కోడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఈ ఏజ్ లోను యమా ఎనేర్జిటిక్ గా రవితేజ సినిమాల్లో నటిస్తాడు. జిమ్ తో బాడీ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే రవితేజ తాజాగా గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాతో పాటుగా రవితేజ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాడు. అయితే మొన్నీమధ్యన రవితేజ – రమేష్ వర్మ ల మూవీ కి బడ్జెట్ ప్రాబ్లెమ్ వలన సినీమా సెట్స్ మీదికెళ్ళేవరకు డౌట్ అంటూ న్యూస్ రావడం.. వెంటనే మూవీ యూనిట్ స్పందించి అదేమీ లేదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే తాజాగా రమేష్ వర్మ రవితేజ స్క్రిప్ట్ మీద కూర్చోవడమే కాదు… స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని… ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. అయితే రవితేజ సినిమాకి రమేష్ వర్మ ఓ పవర్ ఫుల్ ఎనర్జీ టైటిల్ ని ఫిక్స్ చేసాడని అంటున్నారు. అది కూడా ఖిలాడీ అని… రవితేజ బాడీ లాంగ్వేజ్ కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరి రవితేజ ఎనర్జీ నటనకు ఈ టైటిల్ భలేగా సింక్ అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News