నిర్ణయం మార్చుకున్న రవితేజ

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉన్న రవితేజకు గత మూడు చిత్రాల నుండి హిట్ లు తిప్పి కొడుతున్నాయి. ‘రాజా ది గ్రేట్’ తరువాత వచ్చిన ‘టచ్ [more]

Update: 2019-01-18 06:14 GMT

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉన్న రవితేజకు గత మూడు చిత్రాల నుండి హిట్ లు తిప్పి కొడుతున్నాయి. ‘రాజా ది గ్రేట్’ తరువాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’.. ఈ మూడు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. రవితేజ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలు డిజాస్టర్స్ కావడం విశేషం. కాబట్టి ఈ పరిస్థితిల్లో రవితేజ ఒక హిట్ చాలా అవసరం. ప్రస్తుతం రవి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఆనంద్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే రీసెంట్ గా ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. కారణం బడ్జెట్ ఎక్కువ అయిపోవడం, స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో షూటింగ్ కి బ్రేక్ పడినట్టు సమాచారం.

తెరపైకి తెరి రిమేక్

కొంచెం లేట్ అయినా రవితేజ నెక్స్ట్ మూవీ ఇదే అనుకున్నారు అంతా. కానీ ఉన్నట్లుండి ఆగిపోయి సంతోష్ శ్రీనివాస్ సినిమాను లైన్లోకి తెచ్చాడట మాస్ రాజా. రెండేళ్ల నుండి రవి తేజ కోసం సంతోష్ శ్రీనివాస్ వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. వాస్తవానికి వీరి కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ రవితేజ ‘తెరి’ రీమేక్ కు పెద్ద ఇంట్రెస్ట్ చూపకపోవడంతో హోల్డ్ లో పడి ఇప్పుడు ముందుకు వచ్చింది. ఆనంద్ తో రవి సినిమా చేస్తాడు అనుకుంటే సడన్ గా సంతోష్ దర్శకత్వంలో ‘తెరి’ రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Tags:    

Similar News