ప్లాప్స్ ఉన్నా.. అందుకే ఎగబడేది!!

రవితేజ కి వరసగా ప్లాప్స్ తప్ప హిట్ అన్నదే లేదు. ఆ ప్లాప్స్ కూడా ఘోరమైన ప్లాప్స్ ఉన్నాయి. అయినా రవితేజ కెరీర్ లో ఎక్కడా గ్యాప్ [more]

Update: 2020-08-04 17:07 GMT

రవితేజ కి వరసగా ప్లాప్స్ తప్ప హిట్ అన్నదే లేదు. ఆ ప్లాప్స్ కూడా ఘోరమైన ప్లాప్స్ ఉన్నాయి. అయినా రవితేజ కెరీర్ లో ఎక్కడా గ్యాప్ రావడం లేదు. వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దర్శకనిర్మాతలు రవితేజ వెంట పడుతూనే ఉన్నారు. రవితేజ కి ప్లాప్స్ ఉన్నాయి కదా అని పారితోషికం తగ్గడు. పారితోషికంలో కటింగ్స్ ఉంటె సినిమానే వదిలేస్తాడు కానీ చెయ్యడు. అయినా రవితేజ స్పీడు తగ్గలేదు. క్రాక్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా..రవితేజ చేతిలో మరో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. న‌క్కిన త్రినాథ‌రావు తో ఓ సినిమా మరోపక్క ర‌మేష్ వ‌ర్మ క‌థ రెడీ చేసుకున్నాడు. అలాగే ఫస్ట్ సినిమానే ప్లాప్ అయిన వ‌క్కంతం వంశీ ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఇది కాకుండా మ‌రో రీమేక్ కూడా రెడీ అవుతోంది.

అయితే రవితేజ పారితోషికం తగ్గించకపోయినా.. అలాగే వరసగా డిజాస్టర్స్ ఉన్నప్పటికీ… దర్శకనిర్మాతలు రవితేజ వెంటబడి సినిమాలు చెయ్యడానికి కారణం ర‌వితేజ టైమ్ సెన్స్‌. పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తూ సినిమాని చాలా త్వ‌ర‌గా పూర్తి చేయ‌గ‌ల‌డు ర‌వితేజ‌. అంతేకాకుండా ర‌వితేజ సినిమా అంటే హిందీ డ‌బ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ తో నిర్మాతలు సేఫ్ అవుతారు. ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ మీడియం హీరోలంతా బిజీ. మరోపక్క స్టార్ హీరోలెవ‌రూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందుబాటులో లేరు.అందుకే అందరి ఆప్షన్ రవితేజ. చాలామంది దర్శకులు కథలతో సిద్ధం. కానీ హీరోలెవరు వారి చేతికి దొరక్కపోవడంతోనే అందరూ రవితేజ వెంటపడి కమిట్ చేయించుకుంటున్నారు.

Tags:    

Similar News