బోల్డ్ పాత్ర‌ల‌కు రెడీ..!

ఒకప్పుడు స్టార్ హీరోస్ తో చేసి స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళు కొనసాగిన నటి భూమిక ప్రస్తుతం తెలుగు లో మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. [more]

Update: 2020-05-08 04:41 GMT

ఒకప్పుడు స్టార్ హీరోస్ తో చేసి స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళు కొనసాగిన నటి భూమిక ప్రస్తుతం తెలుగు లో మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తుంది. నాని ఎంసీఏలో లో ఆయనకు వదినగా నటించిన భూమిక కు ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. ఇక తరువాత చేసిన రూలర్ లో ఓ కీల‌క‌మైన పాత్ర పోషించినా అది కూడా ఆమె కెరీర్‌కి ఏ కోణంలోనూ ఉప‌యోగ‌ప‌డలేదు. దాంతో ఇప్పుడు ఏం అనుకుందో ఏంటో 'బోల్డ్ పాత్ర‌ల‌కు రెడీ' అంటూ ఓ విచిత్ర‌మైన స్టేట్ మెంట్ ఇచ్చింది.

అవును లేటెస్ట్ గా ఈమె బోల్డ్ పాత్రలకు సై అంటూ డైరెక్టర్స్ కి సవాలు విసిరింది. భూమిక‌ని బోల్డ్ పాత్ర‌ల్లో చూపించే సాహ‌సం ద‌ర్శ‌కులు, చూపించినా చూసే ధైర్యం ప్రేక్ష‌కులు చేయ‌లేరు. కానీ ఆమె మాత్రం అందులో తప్పేముంది 'వ‌య‌సుతో ప‌నేముంది? ఆంధాధూన్‌లో ట‌బు ఆ త‌ర‌హా పాత్ర‌లు చేయ‌లేదేంటి?' అని లాజిక్కులు తీస్తోంది. అంటే ఈమె ఆంధాధూన్‌ రీమేక్ లో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చిందేమో.

అంధాధూన్ ని నితిన్‌తో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హిందీ వెర్ష‌న్ లో ట‌బు చేసిన పాత్ర కోసం త‌గిన న‌టిని వెదుకుతున్నారు. టబు ప్లేస్ లో భూమిక ని తీసుకున్నారేమో? అందుకే ఇలా హింట్ ఇస్తుంది. ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయితే ఆమె కెరీర్ కి ఇంకా డోకా ఉండదు.

Similar News