విశాల్ చక్ర విలన్ గా ఆ హీరోయిన్..?

కోలీవుడ్ హీరో విశాల్ మంచి హిట్స్ మీదున్నాడు. వరసగా సస్పెన్స్ థ్రిల్లర్ హిట్స్ తో టాప్ లో దూసుకుపోతున్న విశాల్ ఇప్పుడు చక్ర అంటూ వచ్చేస్తున్నాడు. అభిమన్యుడు [more]

Update: 2020-06-28 14:28 GMT

కోలీవుడ్ హీరో విశాల్ మంచి హిట్స్ మీదున్నాడు. వరసగా సస్పెన్స్ థ్రిల్లర్ హిట్స్ తో టాప్ లో దూసుకుపోతున్న విశాల్ ఇప్పుడు చక్ర అంటూ వచ్చేస్తున్నాడు. అభిమన్యుడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చక్ర మూవీ తాజాగా నాలుగు భాషల్లో ట్రైలర్ విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కారణం అభిమన్యుడు భారీ హిట్ గనక. అభిమన్యుడు సినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కి భారీ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా చక్ర మూవీ చేసాడు విశాల్. అయితే ఈ సినిమాలో కూడా విశాల్ అభిమన్యుడి వలె మిలటరీ ఆఫిసర్ గాను, అర్జున్ హ్యాకర్ అంటే విలన్ గాను నటిస్తున్నారు. అయితే ఇప్పుడు చక్ర సినిమా లో ఓ లేడి విలన్ పై సస్పెన్స్ కనబడుతుంది.

ఆమె ఎవరో కాదు.. ఈ మధ్యన హీరోయిన్ అవకాశాలు తగ్గిన హాట్ గర్ల్ రెజినా. ఎవరు సినిమాలో అడవిశేష్ కి విలన్ గా అదరగొట్టేసింది రెజీనా.. తాజాగా చక్ర లో కూడా ఓ విలన్ పాత్ర చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. ఎందుకంటే రెజినా చక్ర సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చెయ్యడం.. చక్ర సినిమా ట్రైలర్ లో లేడి విలన్ ని చూపించకుండా హైప్ చేసారని.. ఇంతకుముందే రెజినా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేసిన.. చక్ర ట్రైలర్ లో ఆమెని చూపించకపోయేసరికి.. రెజినా ఈ సినిమా లో లేడి విలన్ గా నటిస్తుంది అని అంటున్నారు. శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెజినా ది పెద్ద విలన్ పాత్రే అంటున్నారు. ఇక హ్యాకింగ్ కింగ్ గా మొత్తం వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకుని.. వ్యవస్థనే ఆటాడించే పాత్రలో అర్జున్ సూపర్ డూపర్ కేరెక్టర్ వేస్తున్నాడని చక్ర ట్రైలర్ చూస్తే అర్ధమైంది. మరి ఈ సినిమాలో నిజంగా రెజినా విలనా.. లేదంటే మారేదన్నానా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అంటున్నారు. 

Tags:    

Similar News