దీపికా అయ్యింది.. రెహ్మాన్ మిగిలాడు!!

మొన్నామధ్యన బాలీవుడ్ మాఫియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రెహ్మాన్.. టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. రెహ్మాన్ తో పనిచేయడానికి అందరూ ఎదురు చూస్తారు. కానీ బాలీవుడ్ [more]

Update: 2020-08-05 09:00 GMT

మొన్నామధ్యన బాలీవుడ్ మాఫియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రెహ్మాన్.. టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. రెహ్మాన్ తో పనిచేయడానికి అందరూ ఎదురు చూస్తారు. కానీ బాలీవుడ్ లో ఓ గ్యాంగ్ తనకి బాలీవుడ్ లో పెద్ద సినిమా అవకాశాలు రాకుండా చేస్తుంది అంటూ హాట్ హాట్ గా మాట్లాడి అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. అయితే టాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలు చేసిన రెహ్మాన్ కి తెలుగు ఆఫర్స్ ని రిజెక్ట్ చెయ్యడం అలవాటే. గతంలో చిరు సై రా సినిమాకి ఒప్పుకుని తర్వాత సై రా టీం కి హ్యాండ్ ఇచ్చాడు. ఇక తాజాగా నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబో మూవీ కి ఏ ఆర్ రెహ్మాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ సంప్రదించబోతున్నాడనే టాక్ నడుస్తుంది.

అయితే రెహ్మాన్ నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ కి మ్యూజిక్ ఇవ్వడానికి భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్నాడనే టాక్ బి టౌన్ లోను, టి టౌన్ లోను వినబడుతుంది. అయినప్పటికీ నాగ్ అశ్విన్ అండ్ టీం రెహ్మాన్ అడిగింది ఇవ్వడానికి రేడి అవుతున్నట్టుగా చెబుతున్నారు. మరి మొన్న ప్రభాస్21 కోసం దీపికా అడిగిన 20 కోట్ల పారితోషకానికి  అలాగే దీపికా పదుకొనే పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకున్న నాగ్ అశ్విన్ వాళ్ళు ఇప్పుడు ఏ ఆర్ రెహ్మాన్ డిమాండ్ కి కూడా తలొగ్గారనే టాక్ మొదలయ్యింది. ఏది ఏమైనా ప్రభాస్ 21 మాత్రం బాగా కాస్ట్లీ వ్యవహారంలా కనబడుతుంది.  

Tags:    

Similar News