బాలీవుడ్ పై రెహ్మాన్ ఫైర్
ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ నేపోటిజం పై అభిమానులే కాదు.. సినీ నేపథ్యం లేని సెలబ్రిటీస్ ఓపెన్ అవడమే కాదు… ఓ రేంజ్ [more]
ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ నేపోటిజం పై అభిమానులే కాదు.. సినీ నేపథ్యం లేని సెలబ్రిటీస్ ఓపెన్ అవడమే కాదు… ఓ రేంజ్ [more]
ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయంలో బాలీవుడ్ నేపోటిజం పై అభిమానులే కాదు.. సినీ నేపథ్యం లేని సెలబ్రిటీస్ ఓపెన్ అవడమే కాదు… ఓ రేంజ్ లో బాలీవుడ్ నేపోటిజంపై పడుతున్నారు. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణించి నెలలు గడుస్తున్నా అతని మరణం ఇంకా బాలీవుడ్ లో హాట్ టాపిక్కే. సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం తర్వాత అయన నటించిన దిల్ బేచారే విడుదలై సంచాలను సృష్టించింది. ఓటిటిలో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమాల్లో దిల్ బేచారే నెంబర్ వన్ స్థానంలో నిలువగా.. ఇప్పుడు బాలీవుడ్ కరణ్ జోహార్, అలియా లాంటి వాళ్ళు సుశాంత్ మరణానికి పరోక్షంగా కారణమంటూ నిరసనలు వెల్లవెత్తున్న తరుణంలో తమిళ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని భాషల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది.
ఏఆర్ రెహ్మాన్ అంటే సంగీతం సలాం కొడుతోంది. రెహ్మాన్ మ్యూజిక్ అంటే పడిచచ్చిపోతారు. కాకపోతే రెహ్మాన్ చాలా స్లోగా మ్యూజిక్ ఇస్తాడని ప్రచారం ఉంది. అయితే బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలుని ఓ వర్గం అడ్డుకుంటుంది అని.. తన మీద వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ… చాలా సినిమాలు తనవరకు రాకుండా ఆ గ్యాంగ్ అడ్డం పడుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ టాలీవుడ్ లోను సంచలనం అయ్యింది. టైం కి పని చెయ్యడు అని, సకాలంలో బాణీలు సమకూర్చడని, తనపై జరుగుతున్న ప్రచారానికి ఆ వర్గమే కారణమంటూ రెహ్మాన్ బాలీవుడ్ లో ఓ ముఠాపై విరుచుకుపడుతున్నారు. సుశాంత్ సింగ్ తాజా చిత్రం దిల్ బేచారే కి దర్శకుడు న తన పేరు సూచించగా.. రెహ్మాన్ వద్దకు వద్దని ఆ ముఠాచెప్పింది అని.. కానీ దిల్ బేచారే దర్శకుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇవ్వగా కేవలం 48 గంటల్లోనే 4 పాటలకు ట్యూన్స్ ఇచ్చానని చెబుతున్నడు. అన్నట్టు దిల్ బేచారే సినిమాకి మ్యూజిక్ ప్రాణం అన్నట్టుగా ఉంది. ఇక రెహ్మాన్ కి అడ్డుపడుతున్నది ఎవరో పేర్లు మాత్రం చెప్పలేదు.