గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోన్న రేణుదేశాయ్
సమంత, మమత మోహన్ దాస్ వంటి హీరోయిన్లు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్
ఇటీవల కాలంలో టాలీవుడ్ కి చెందిన పలువురు హీరోయిన్లు వరుసగా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమంత, మమత మోహన్ దాస్ వంటి హీరోయిన్లు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన అనారోగ్యం గురించి వెల్లడించారు. కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. తన సన్నిహితులకు, తనను దగ్గరగా చూస్తున్నవారికి ఈ విషయం తెలుసని రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను వాటికి చికిత్స తీసుకుంటున్నానని, మందులు వాడుతూ.. యోగా చేస్తున్నానని తెలిపారు. అలాగే ఆహారంలో మంచి పోషక పదార్థాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. తనలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో ధైర్యాన్ని నింపేందుకే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సరే ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకూడదని సూచించారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుని షూటింగుల్లో పాల్గొంటానని తెలిపారు.