పవన్ తరువాత.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. రేణూదేశాయ్ కామెంట్స్..

పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత అందుకే పెళ్లి చేసుకోలేదంటూ రేణూదేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Update: 2023-10-15 12:27 GMT

బద్రి సినిమాలో జంటగా కనిపించిన పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్.. నిజ జీవితంలో కూడా పెళ్లిబంధంతో ఒక్కయ్యారు. 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు.. మూడేళ్లకే విడాకులు తీసుకోని విడిపోయారు. 2012 నుంచి రేణూదేశాయ్ పవన్ కి దూరంగానే ఉంటున్నారు. ఇక వీరిద్దరికి పుట్టిన పిల్లలు అకీరా నందన్, ఆద్య.. రేణూదేశాయ్ దగ్గరే ఉంటున్నారు. కాగా ఈ విడాకుల తరువాత పవన్ మరో పెళ్లి చేసుకున్నారు.

కానీ రేణూదేశాయ్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నారు. అప్పటిలో ఆమె కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. కానీ అది జరగలేదు. అందుకు గల కారణం ఇప్పుడు బయట పెట్టారు రేణూదేశాయ్. 2003లో వచ్చిన 'జానీ' సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో కనిపించని రేణూదేశాయ్.. ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో ఉన్న ఈమె.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ..
"నా తల్లిదండ్రులు అబ్బాయి పుడతాడని ఆశించిన సమయంలో నేను పుట్టాను. దీంతో వాళ్ళు చాలా నిరాశ చెందారు. మా నాన్న అయితే మూడు రోజులు నా మొహం కూడా చూడలేదని మా అమ్మ చెప్పింది. ఆడపిల్ల పుడితే చంపేసే తల్లిదండ్రులు ఉంటారు. అయితే నా పేరెంట్స్ చదువుకున్నవారు కాబట్టి నన్ను చంపకుండా దూరం పెట్టారు. దీంతో నేను వల్ల ప్రేమ తెలియకుండా.. పని వాళ్ళ చేతుల్లో పెరిగాను.
పవన్‌తో విడాకులు తరువాత ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఆ తరువాత నా పిల్లల్ని కూడా నాలా పనివాళ్లు చేతుల్లో పెరగాల్సి వస్తుందేమో అనుకున్నాను. లైఫ్ లో విడాకుల తీసుకున్న సందర్భం చాలా కష్ట కాలం అని భావిస్తారు. అయితే అంతకన్నా కష్టమైన కాలం.. పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ అందకపోవడం. నేను నా పిల్లలకి అలాంటి పరిస్థితి కల్పించకూడదు అనుకున్నాను.
అందుకనే రెండో పెళ్లి ఆలోచన మానుకున్నాను. అయితే నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం. మరో రెండు మూడేళ్ళలో నా పిల్లలు పూర్తిగా సెట్ అవుతారు. ఆ తరువాత మళ్ళీ పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.


Tags:    

Similar News