మహేశ్ సినిమా వదులుకున్న రేణూదేశాయ్..
మహేష్ బాబు సినిమాని వదులుకున్నాను అని చెప్పిన రేణూదేశాయ్.. అందుకు గల కారణాలు చెబితే కాంట్రవర్సీ అవుతుందని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ 'జానీ' సినిమా తరువాత యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేసిన రేణూదేశాయ్.. ఇప్పుడు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో మళ్ళీ యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో 'హేమలత లవణం' అనే ముఖ్య పాత్రని రేణూదేశాయ్ పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ నటి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తనకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహేష్ బాబు సినిమా ఆఫర్ ని వదులుకున్నట్లు వెల్లడించారు. 'అందుకు గల కారణాలు చెబితే కాంట్రవర్సీ అవుతుందని' రేణూదేశాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ అసలు అది ఏ సినిమా..? ఆ మూవీలో రేణూదేశాయ్ పాత్ర ఏంటి..?
మహేష్ బాబు నుంచి చివరిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ 'సర్కారు వారి పాట'. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఎంటర్‌టైన్మెంట్ తో పాటు ఒక సోషల్ మెసేజ్ ని కూడా ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రంలో రేణూదేశాయ్ నటించాల్సి ఉందట. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇంతకీ మూవీలో ఏ పాత్ర కోసం దర్శకుడు ఆమెను సంప్రదించాడని ఆలోచిస్తున్నారా..?
సినిమా కథని ఒక మలుపు తిప్పే రోల్.. బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం రేణూదేశాయ్ ని మూవీ టీం సంప్రదించారట. స్టోరీ విన్న రేణూదేశాయ్‌కి.. కథ, పాత్ర బాగా నచ్చాయి. సినిమాలో నటించాలని కూడా అనుకున్నారట. కానీ కొన్ని కారణాలు వల్ల ఆమె నటించడం వీలు కాలేదట. ఆ కారణాలు ఏంటనేవి చెబితే.. "అనవసరమైన కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందని, అందుకనే నిజం చెప్పాలని ఉన్నా, సైలెంట్ గా ఉండిపోతున్నానని" ఆమె పేర్కొన్నారు. ఇక ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇవి విన్న నెటిజెన్స్.. అసలు ఆ కారణాలు ఏంటని సోషల్ మీడియాలో చర్చికోవడం మొదలు పెట్టారు.