సినిమా షూటింగ్స్ @ రామోజీ ఫిలిం సిటీ?

హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అంత కరోననే. ఎక్కడ షూటింగ్ చేసినా కరోనా భీబత్సమే. అందుకే అన్ని భాషల హీరోలు అన్ని [more]

Update: 2020-08-20 08:54 GMT

హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు, టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అంత కరోననే. ఎక్కడ షూటింగ్ చేసినా కరోనా భీబత్సమే. అందుకే అన్ని భాషల హీరోలు అన్ని పనులు ఆపుకుని ఇంటికే పరిమితమయ్యారు. బాలీవుడ్ హీరోలైన కాస్త ధైర్యంతో విదేశాలకు షూటింగ్స్ కి వెళుతున్నారు కానీ.. టాలీవుడ్, కోలీవుడ్ హీరోలైతే గప్ చుప్ గా కనబడుతున్నారు. అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు విదేశాల లకు కనెక్ట్ అయిన షూటింగ్స్ అన్ని ఇప్పుడు హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు. దానికి హైదెరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీనే అన్నిటికన్నా బెస్ట్. కాబట్టే ఇప్పుడు విదేశీ షెడ్యూల్స్ అన్ని రామోజీకి షిఫ్ట్ అయ్యే ఏర్పాట్లు మొదలయ్యాయి.

అయితే ఒకటా రెండా చాలా సినిమాలు విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఛలో రామోజీ ఫిలిం సిటీ అంటున్నాయట. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీకి ఫుల్ డిమాండ్ పెరిగింది కూడా. ఇక భారీ బడ్జెట్ మూవీస్ కి ముందుగా  డేట్స్ వైజ్ గా షూటింగ్ కి పెర్మిషన్ ఇస్తున్నారట. ఫస్ట్ భారీ స్టార్ హీరోల సినిమాలకు… అలాగే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సిన సినిమాలకు ఫిల్మ్ సిటీ వారు ముందుగా డేట్స్ ఇస్తున్నట్లు.. వారికి కావాల్సిన లొకేషన్స్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి భారీ బడ్జెట్చే నిర్మాతలకు ఇది మేలు చేసినట్టే.  నిర్మాతలు నష్టపోకుండా రామోజీ ఫిలింసిటీ ప్లాన్స్ ఉన్నాయట. 

Tags:    

Similar News