ఎట్టకేలకు బయటికొచ్చిన హీరోయిన్?
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయం లో హీరోయిన్ రియా చక్రవర్తి పై మొదలైన విచారణ కాస్త డ్రగ్స్ కేసుగా మరి రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యడం [more]
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయం లో హీరోయిన్ రియా చక్రవర్తి పై మొదలైన విచారణ కాస్త డ్రగ్స్ కేసుగా మరి రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యడం [more]
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య విషయం లో హీరోయిన్ రియా చక్రవర్తి పై మొదలైన విచారణ కాస్త డ్రగ్స్ కేసుగా మరి రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యడం వరకు అందరికి తెలిసిన విషయమే. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి చాలామందిని ఇరికించింది. దానితో ఆ హీరోయినా అంతా ఎన్ సీబీ ముందు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈలోపు రియా చక్రవర్తి తన తమ్ముడు షోవిక్ తో జైలు లో ఉంటూనే బెయిల్ కోసం నానా కష్టాలు పడుతోంది. సెప్టెంబర్ 8 న అరెస్ట్ అయినా రియా చక్రవర్తి నెల రోజులుగా జైలు లో గడుపుతోంది. ఆమె లాయర్ ఆమె బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
అయితే రియా, షోవిక్ బెయిల్ ని చాల సార్లు తిరస్కరించిన ఎన్ సిబి కోర్టు వాళ్ళిద్దరికీ అక్టోబర్ 20 వారికి కష్టడి పొడిగించింది. దీనితో రియా లాయర్ రియా బెయిల్ కోసం ముంబై హి కోర్టుని ఆశ్రయించగా.. కోర్టు రియా పిటిషన్ న పరిశీలించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కానీ రియా సోదరుడు సోవిక్ కి మాత్రం బెయిల్ ఇవ్వలేదు హై కోర్టు. ఇక రియా చక్రవర్తి నెల రోజుల జైలు జీవితానికి ముంబై హై కోర్టు బెయిల్ మంజూరు చేసి మోక్షం కల్పించింది. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ ప్రకటించడం రియా ఆ విషయంలో తప్పించుకున్నా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి మాత్రం కష్టాలు అనుభవించింది.