అందుకేనా సిబిఐ విచారణ కోరుతుంది!!

తెలుగులో తూనీగ తూనీగ అంటూనే ఎగిరిపోయి మళ్ళీ కనబడకుండా పోయిన రియా చక్రవర్తి మల్లి బాలీవుడ్ లో తేలింది. అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాకపోయినా…. సుశాంత్ [more]

Update: 2020-07-19 05:18 GMT

తెలుగులో తూనీగ తూనీగ అంటూనే ఎగిరిపోయి మళ్ళీ కనబడకుండా పోయిన రియా చక్రవర్తి మల్లి బాలీవుడ్ లో తేలింది. అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాకపోయినా…. సుశాంత్ సింగ్ రాజపుట్ గర్ల్ ఫ్రెండ్ గా నిత్యం వార్తల్లో ఉండేది. సుశాంత్ సింగ్ రాజపుట్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న రియా చక్రవర్తి.. సుశాంత్ సింగ్ చనిపోయే టైం కి అతనికి దూరంగానే ఉంటుంది. అందులో సుశాంత్ సింగ్ రాజపుట్ – రియా చక్రవర్తిల బ్రేకప్ న్యూస్ కూడా నడిచింది. ఇక సుశాంత్ ఆత్మహత్యతో మరోసారి హైలెట్ అయినా రియా చక్రవర్తి ఇప్పుడు పోలీస్ ల చుట్టూ తిరిగుతుంది. సుశాంత్ మరణం తర్వాత పోలీస్ లు రియా ని మూడుసార్లు విచారించారు. ఆమె సుశాంత్ మరణానికి కారణమని సుశాంత్ అభిమనులు చాలామంది నమ్ముతున్నారు. రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ మరణానికి కారణం అవ్వకపోయినా ఆమె ఇండైరెక్ట్ గా సుశాంత్ మరణకి కారణమవ్వొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పోలీస్ లు రియా చక్రవర్తికి సినిమాలు లేకపోయినా.. ఆమె అంత లగ్జరిగా ఎలా బ్రతుకుతుంది. ఆమెకి డబ్బు ఎలా వచ్చింది అనే కోణంలో రియాని విచారిస్తున్నారట.

రియా చక్రవర్తి అన్నతో సుశాంత్ కి బిజినెస్ లావాదేవీలు ఉన్న నేపథ్యంలో రియా పై సుశాంత్ మరణం ఎఫెక్ట్ బాగానే పడింది. ఇక సుశాంత్ సింగ్ రాజపుట్ అభిమానులైతే.. ఆమెని చంపేస్తామని, రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారట. అందుకే సుశాంత్ చనిపోయినా.. సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న రియా చక్రవర్తి ఇప్పుడు అతను చనిపోయిన నెలకి ట్వీట్స్ చేస్తుంది. నువ్వు చనిపోయి నెల అయ్యింది. కానీ నీతో ఉన్న స్నేహం మాత్రం మరవలేకపోతున్నాను.. అంటూ సుశాంత్ సెల్ఫీ వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడమే కాదు.. ఏకంగా కేంద్ర హోమ్ మినిస్టర్ కి సుశాంత్ సింగ్ రాజపుట్ కేసు సీబీఐకి అప్పగించాలంటూ ట్వీట్ చేసింది. మరి మహారాష్ట్ర హోమ్ మంత్రి సుశాంత్ సింగ్ రాజపుట్ కేసు సీబీఐకి అక్కర్లేదు.. ఆ కేసుని ఛేదించగల సత్తా పోలీసులకు ఉంది అని చెబుతున్నాడు. 

Tags:    

Similar News