జబర్దస్త్ కు రోజా కన్నీటి వీడ్కోలు.. భావోద్వేగంతో ఆఖరి ఎపిసోడ్
జబర్దస్త్ టీమ్ తమ అభిమాన రోజాకు వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న ఆఖరి ఎపిసోడ్ లో రోజాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా;
హైదరాబాద్ : నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, తాజాగా మంత్రి పదవి చేపట్టారు ఆర్కే రోజా. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ కూర్పులో భాగంగా రోజాకు వైసీపీ ప్రభుత్వం టూరిజం శాఖ అప్పగించింది. కాగా.. ఇప్పటివరకూ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లలో రోజా న్యాయనిర్ణేతగా ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టడంతో.. మంత్రిగా తన బాధ్యతలు పెరిగాయని, ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జబర్దస్త్ టీమ్ తమ అభిమాన రోజాకు వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న ఆఖరి ఎపిసోడ్ లో రోజాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా భావోద్వేగానికి గురయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్ లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సేవ చేయడం తనకెంతో ఇష్టమన్న రోజా.. ప్రజాసేవ కోసమే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని భావోద్వేగాలతో తెలిపారు. తనకు అవకాశమిచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. యాంకర్లు, పార్టిసిపెంట్లు రోజాకు వీడ్కోలు పలుకుతూ కంటతడి పెట్టుకున్నారు. తాజాగా ఈటీవీ అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.