ఆకాశ్ పూరి `రొమాంటిక్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మజంట‌గా న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. `ఇస్మార్ట్  శంక‌ర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, [more]

Update: 2019-09-30 08:45 GMT

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మజంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రొమాంటిక్‌'. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. 'ఇస్మార్ట్ శంక‌ర్‌' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్‌, హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫ‌స్ట్ లుక్‌గా విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే సినిమా హైద‌రాబాద్‌, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సోమ‌వారం నుంచి కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లోనే ప్రారంభం కానుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందించారు.

 

Tags:    

Similar News