RRR ఆఖరి అంకం!

కరోనా క్రైసిస్ తో RRR షూటింగ్ గత ఏడాది మార్చ్ లో ఆగిపోయింది. మళ్ళీ నవంబర్ నుండి రాజమౌళి RRR షూటింగ్ మొదలు పెట్టాడు. అప్పటినుండి రాజమౌళి [more]

Update: 2021-01-20 17:09 GMT

కరోనా క్రైసిస్ తో RRR షూటింగ్ గత ఏడాది మార్చ్ లో ఆగిపోయింది. మళ్ళీ నవంబర్ నుండి రాజమౌళి RRR షూటింగ్ మొదలు పెట్టాడు. అప్పటినుండి రాజమౌళి నిద్ర లేకుండా RRR షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నాడు. మధ్యలో RRR హీరోలు చరణ్, ఎన్టీఆర్ లు చిన్నపాటి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసినా, చరణ్ కరోనా తో 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నా రాజమౌళి మాత్రం RRR షూటింగ్ కి గ్యాప్ ఇవ్వలేదు. షూటింగ్ మళ్ళీ మొదలయ్యాక 50 రోజుల భారీ షెడ్యూల్ ని రాజమౌళి ముగించి అందరికి షాకిచ్చాడు. RRR హీరోలు రామ్ చరణ్-తారక్ లు రాజమౌళికి సహకారం అందించడం, ఇందులో నటిస్తున్న టాప్ టెక్నీషియన్స్ డేట్స్ పక్కాగా సెట్ చేసుకోవడంతో RRR షూటింగ్ కి అంతరాయం కలగకుండా జరుగుతూనే ఉంది. తాజాగా RRR భారీ క్లైమాక్స్ షూట్ ప్రారంభం కాబోతున్నట్టుగా కొమరం భీం – అల్లూరి చేతులని కలిపిన పిక్ తో ట్వీట్ చేసింది RRR బృందం.
వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ఉన్న RRR పాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందులోను హీరోలు రామ్ చరణ్, తారక్ కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న RRR నుండి భారీ అప్ డేట్ సోషల్ మీడియాలో రావడంతో మెగా, తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. క్లైమాక్స్ మొదలైంది.. నా రామరాజు, భీమ్ ఇద్దరూ వాళ్లు కోరుకున్న దానికోసం యుద్ధం మొదలు పెట్టారు అంటూ రాజమౌళి ట్వీట్ చెయ్యడంతో.. అన్ని తారక్ రీ ట్వీట్ చేస్తూ ఎగ్జైటెడ్ అంటూ ట్వీట్ చేసాడు. ఈ క్లైమాక్స్ షూటింగ్ లో స్టార్ హీరోలైన చరణ్, తారక్ ఇద్దరూ పాల్గొనబోతున్నట్టుగా రాజమౌళి రిలీజ్ చేసిన పిక్ చూస్తే తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ పూర్తికాగానే రాజమౌళి RRR సెట్ ప్రకటిస్తారేమో అని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News