IMDB వరల్డ్ టాప్ 5 సినిమాల్లో RRR . రేటింగ్ లో నంబర్ 1
తాజాగా RRR మరో రికార్డును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇచ్చే ప్రముఖ సంస్థ..;
హైదరాబాద్ : తారక్-చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ RRR. సినిమా విడుదలై 13 రోజులవుతున్నా.. దానికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జక్కన్న చెక్కిన RRR సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.750 కోట్లు కొల్లగొట్టిన RRR.. ఇప్పుడు రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
తాజాగా RRR మరో రికార్డును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇచ్చే ప్రముఖ సంస్థ IMDB తాజాగా 2022 మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాను విడుదల చేసింది. హాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసి.. ఐఎండిబి వరల్డ్ టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రేటింగ్ పరంగా చూస్తే.. RRR నంబర్ 1 స్థానంలో నిలిచి.. వర్డ్ రికార్డును కొట్టేసింది. 9 స్టార్ రేటింగ్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఆస్కార్ విన్నింగ్ CODA మూవీకి 8.1 రేటింగ్ దక్కింది.