ఆర్.ఆర్.ఆర్ అదిరే అప్ డేట్
భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న డేట్ కి వస్తుందో.. రాదో.. తెలియదు కానీ.. సెకండ్ [more]
భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న డేట్ కి వస్తుందో.. రాదో.. తెలియదు కానీ.. సెకండ్ [more]
భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ సినిమా అనుకున్న డేట్ కి వస్తుందో.. రాదో.. తెలియదు కానీ.. సెకండ్ వేవ్ తర్వాత రాజమౌళి చాలా ఫాస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ షూట్ ని మొదలు పెట్టేసాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో రెండు సాంగ్స్ చిత్రీకరణ చెయ్యబోతున్నట్టుగా స్పెషల్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చేసింది ఆర్.ఆర్.ఆర్ టీం. రామ్ చరణ్ గుఱ్ఱమెక్కిన, ఎన్టీఆర్ బైక్ మీద ఉన్న అదిరిపోయే పోస్టర్ ని గతంలో ఆర్.ఆర్.ఆర్ టీం రిలీజ్ చెయ్యగా అది విపరీతంగా ఫాన్స్ ని ఆకట్టుకుంది.
ఇక నేడు ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన రెండు పాటల చిత్రీకణ మొదలవబోతున్నట్టుగా చరణ్, తారక్ బైక్ మీద ఉన్న పోస్టర్ ని రివీల్ చేసింది. తారక్ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. చరణ్ బైక్ మీద వెనకగా ఎగ్జైటింగ్ గా కూర్చున్న ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ చూసిన మెగా, ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలా పోస్టర్ రిలీజ్ చేస్తుంటే సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అవడం మాత్రం ఖాయం. ఇక నిన్న రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ పోస్ట్ కరోనా షూటింగ్ అప్ డేట్ పోస్టర్.. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతుంది.