20 జులై 30 నుండి 21 జులై 30 కి వెళ్లిందా!!
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ముందు అనుకున్న సమయానికి [more]
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ముందు అనుకున్న సమయానికి [more]
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ముందు అనుకున్న సమయానికి విడుదలై ఉంటె…. ఈపాటికి ప్రమోషన్స్ తో థియేటర్స్ అలాగే ఇండియా లోని టాప్ సిటీస్ లలో ఆర్ ఆర్ టీం హడావిడి మాములుగా ఉండేది కాదు. రాజమౌళి మొదట్లో ఆర్ ఆర్ ఆర్ ని జులై 30 న విడుదల చేస్తా అన్నాడు. తర్వాత మల్లి షూటింగ్ లెట్ కావడం.. గ్రాఫిక్స్ వర్క్ లెట్ అవుతుండడంతో…. ఆర్ ఆర్ ఆర్ ని జనవరి 8 2021 కి విడుదల తేదీని మార్చారు. ఎలాగో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు షూటింగ్ లో సక్రమంగా జాయిన్ అవుతూ.. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పరుగులుపెడుతూ జనవరి 8 కి పక్కా గా విడుదలయ్యేలా షూటింగ్ జరుగుతన్న టైం లో కరోనా మహమ్మారి అడ్డం పడింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ జనవరి 8 2021 నుండి విడుదల తేదీ పోస్ట్ పోన్ అయ్యింది.
మరి కరోనా తగ్గి ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏప్రిల్ కైనా థియేటర్స్ లోకి వస్తుంది అనుకుంటే.. అది మాత్రం సాద్యమయ్యేలా లేదు. రాజమౌళి ఎంత గట్టిగా ప్రయత్న్చించినా ఏప్రిల్ లో మూవీ ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చెయ్యడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే పనిగా లేదు. కరోనా తగ్గినా ఆగష్టు నుండి సినిమా షూటింగ్ జరుగుతుందని ఆనుకుంటే అనుమానమే. మొత్తంగా డిసెంబర్ నుండి హీరోలు సెట్స్ మీదకెళ్లాలా ఉన్నారు. ఆలా ఈ జులై లో విడుదల అనుకున్న ఆర్ ఆర్ ఆర్ కాస్తా వచ్చే ఏడాది అంటే 2021 జులై 30 కి వెలుతుందేమో.. ఇప్పటికే రాజమౌళి ఆ డేట్ ని పరిశీలిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ ఏడాది జులై కి విడుదల అవుతుంది ఆనుకుంటే వచ్చే ఏడాది జులై కి పోయింది ఆర్ ఆర్ ఆర్ సినిమా అంటున్నారు హీరోల ఫాన్స్.