RRR రాజమౌళితో.. టీం అండ్ హీరోల కష్టాలు!!
రాజమౌళి అంటే పర్ఫెక్షన్ కి మారుపేరు… అందుకే ఆయన సినిమాలన్నీ హిట్.. చెక్కిందే చెక్కు చెక్కుతాడు కాబట్టే ఆయనకు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో జక్కన్న అని [more]
రాజమౌళి అంటే పర్ఫెక్షన్ కి మారుపేరు… అందుకే ఆయన సినిమాలన్నీ హిట్.. చెక్కిందే చెక్కు చెక్కుతాడు కాబట్టే ఆయనకు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో జక్కన్న అని [more]
రాజమౌళి అంటే పర్ఫెక్షన్ కి మారుపేరు… అందుకే ఆయన సినిమాలన్నీ హిట్.. చెక్కిందే చెక్కు చెక్కుతాడు కాబట్టే ఆయనకు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో జక్కన్న అని పేరు పెట్టాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ రాజమౌళితో పని చేసే టీం రాజమౌళితో పడే కష్టాలు ఎవరికైనా తెలుసా? అసలు ఆయనతో హీరోలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా?మరి తెలుసుకోండి.. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా RRR టీమ్ అండ్ హీరోలు కలిసి ఓ వీడియో చేసారు. అందులో వాళ్ళు రాజమౌళితో పడుతున్న కష్టాలు బాధలు ఏకరువు పెట్టుకున్నారు. కో డైరెక్టర్ దగ్గరనుండి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు జక్కన్న పర్ఫెక్షన్ కోసం ఎలా అందరిని కష్టపెడుతుంటాడో చెబుతూ ఓ వీడియో షూట్ చేసారు. అసిస్టెంట్ డైరెకర్స్, కో డైరెక్టర్, నిర్మాత దానయ్య, సినిమాటోగ్రఫీ సెంథిల్, సాబు సీరిల్, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు జక్కన్న వలన ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో లో షేర్ చేసారు.
సెంథిల్ అయితే షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్ళిపోతున్న సమయంలో రాజమౌళి అందరిని పిలిచి రేపు జరగబోయే సీన్స్ ముచ్చట చెబుతూ టైం తినేస్తుంటే… సెంథిల్ మాత్రం ఇంటికెప్పుడు వెళ్లాలా అని టైం చూసుకుంటాడట. ఇక ఎన్టీఆర్ అయితే నా ఖర్మో నా దరిద్రమో.. నేను ఏది అనుకుంటానో అది అక్కడ జరగదు. సీన్ పర్ఫెక్షన్ కోసం గంటలో అవ్వాల్సిన సీన్ కాస్తా మూడు నాలుగు గంటలు పడుతుంది. కాంప్లికేటెడ్ సీన్స్ అన్ని రిలాక్స్ అవుతామనుకున్న టైం లోనే జక్కన్న ప్లాన్ చేస్తాడో.. లేదంటే నా దరిద్రమో కానీ అప్పుడే జక్కన్న అలాంటి సీన్స్ ప్లాన్ప్ చేస్తాడు. కానీ చెక్కిందే చెక్కుతాడు కాబట్టే ఆయన జక్కన్నఅని కాదు రాక్షసుడు అంటూ రాజమౌళి పర్ఫెక్షన్ ని రాక్షసత్వంతో పిలుస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ అయితే రాజమౌళి గారు ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తారు.. అబ్బా అంటూ జిమ్ చేసి ఉత్సాహం గా పొద్దుపొద్దున్నే గుడ్ మార్నింగ్ సర్ హౌ ఆర్ యు అనగానే రాజమౌళి హా చరణ్ రా.. రా సిట్ సిట్ అంటారు. ఒక యాక్షన్ సీన్ ని రాజమౌళి చూపిస్తారు. అబ్బా చాలా బావుంది ఎవరు చేస్తారో అంటే ఇంకెవరు నువ్వే అంటారు. ఇక లాప్ తీసుకురండి అంటారు. రెండు రోజుల ముందే లాప్ టాప్ లో అన్ని యాంగిల్స్ లో షూట్ చేసి పెట్టుకుంటారు. ఆయనకి నో అనలేక, చెయ్యలేక మేము పడే కష్టలుంటాయే అంటుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కష్టాలు మరీ ఘోరంగా ఉన్నాయి. జనవరిలో పల్లవి చేస్తే… ఆరు నెలల తర్వాత జూన్ లో చరణం అంటాడు. డిసెంబర్ లో దానికి లిరిక్ రాయిస్తాడు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో దాని రికార్డింగ్ అంటాడు. ఆ తర్వాత వచ్చే నవంబర్ లో దానికి వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఈలోపు అన్ని మర్చిపోతాం అంటూ రాజమౌళి మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఆయన.