15 అంతర్జాతీయ అవార్డులందుకున్న RRR.. వివరాలివిగో

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం..

Update: 2023-01-20 14:23 GMT

RRR receives 15 international awards

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్డెట్ తో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా RRR. తెలుగుజాతి గర్వించదగిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను కలుపుతూ.. కల్పిత కథతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ఒక్క భారత్ లోనే కాదు.. విదేశాల్లోనూ RRR గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులందుకున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచేందుకు పోటీ పడుతోంది. ఇంతవరకూ ఆర్ఆర్ఆర్ 15 అంతర్జాతీయ అవార్డులను అందుకుంది.
1. గోల్డెన్ గ్లోబ్ అవార్డు (జీజీఏ)
2. క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్ (సీసీఎంఏ)
3. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎల్ఏ ఎఫ్ సీఏ)
4. సౌత్ ఈస్ట్రన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ (ఎస్ఈ ఎఫ్ సీఏ)
5. శాటర్న్ అవార్డ్ (ఎస్ఏ)
6. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్ లైన్ (ఎన్ఐఎఫ్ సీఓ)
7. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్ వైఎఫ్ సీసీ)
8. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ (ఎన్ బీఆర్)
9. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ (హెచ్ సీఏఏ)
10. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఏఎఫ్ సీసీ)
11. జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (జీఎఫ్ సీఏ)
12. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (బీఎస్ ఎఫ్ సీ)
13. ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఏఎఫ్ సీఏ)
14. అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ (ఏడబ్ల్యూఎఫ్ జే)
15. ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (యూఎఫ్ సీఏ)


Tags:    

Similar News