చెర్రీ ఆ సినిమా కోసం ట్రై చేస్తున్నాడా?

రామ్ చరణ్ సైరా సినిమా ఒత్తిడి నుంచి బయటికి వచ్చి రాజమౌళి తో RRR సినిమా షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. అంతే కాకుండా తన తండ్రి [more]

Update: 2019-10-23 07:16 GMT

రామ్ చరణ్ సైరా సినిమా ఒత్తిడి నుంచి బయటికి వచ్చి రాజమౌళి తో RRR సినిమా షూటింగ్ లో బిజీ అవుతున్నాడు. అంతే కాకుండా తన తండ్రి కొరటాలతో చేస్తున్న సినిమాకి వన్ అఫ్ ద నిర్మాతగా ఉన్న చరణ్ కి ఇప్పుడు తమిళనాట రీసెంట్ గా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని రీమేక్ చేసే యోచన చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. తమిళంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ సినిమా ఈ నెల 4 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో ధనుష్ మాస్ నటనకు అద్భుతమైన మార్కులు పడుతున్నాయి.

రీమేక్ చేస్తాడా….?

పక్కా మాస్ మసాలా కాన్సెప్ట్ తో తెరకెక్కిన అసురన్ సినిమాకి క్రిటిక్స్ దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రశంశల వర్షం కురిపించడమే కాదు.. విమర్శకులు సైతం అసురన్ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే అసురన్ కథ తన బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని చరణ్ భావించడంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా టాక్. మరి RRR తర్వాత రామ్ చరణ్ అసురన్ రీమేక్ చేస్తాడో లేదంటే RRR సినిమా షూటింగ్ సమయంలోనే అసురన్ రీమేక్ చేస్తాడో అనేది తెలియడమే కాదు ప్రస్తుతం చరణ్ అసురన్ రీమేక్ పై వస్తున్న వార్తల్లో నిజమెంతుందో స్పష్టత లేదు.

 

 

Tags:    

Similar News