సాహో ఫేక్ కలెక్షన్స్ ఎవరికి నష్టం?

సాహో అంచనాలు ఎవరెస్టు ని మించేశాయి. దాదాపు 350 కోట్లు బిజినెస్ తో రిలీజ్ అయినా సాహో చిత్రం మొదటి వారం నెగటివ్ టాక్ తో పర్లేదు [more]

Update: 2019-09-10 08:43 GMT

సాహో అంచనాలు ఎవరెస్టు ని మించేశాయి. దాదాపు 350 కోట్లు బిజినెస్ తో రిలీజ్ అయినా సాహో చిత్రం మొదటి వారం నెగటివ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంది. ఇక రెండో వీకెండ్ లో ఏమన్నా పుంజుకుంటాదేమో అనుకుంటే సెకండ్ వీకెండ్ మొత్తంగా నాలుగు కోట్లు కూడా వసూళ్లు తెచ్చుకోలేకపోయింది ఈచిత్రం. దాంతో ఈచిత్రం రన్ బాక్సాఫీస్‌ వద్ద ముగిసిందని చెబుతున్నారు. ఎలానో ఈ వీకెండ్ కి నాని సినిమా గ్యాంగ్ లీడర్ వస్తుంది కాబట్టి ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోరు.

తెలుగు మార్కెట్ పై ప్రభావం…

సాహో బయ్యర్లు, నిర్మాతలు లెక్కల చిట్టాలు బయటకి తీస్తున్నారట. మొదటి వారం ఫేక్ కలెక్షన్స్ చూపించి సెకండ్ వీకెండ్ కూడా వసూళ్లు చేద్దాం అనుకున్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అసలు లెక్కలు చూసుకుంటే దాదాపుగా అందరికీ సగానికి సగం పోయినట్టేనని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఒక్క హిందీ లో తప్ప ఈ చిత్రం ఎక్కడ సేఫ్ కాలేదు. సాహో మేకర్స్ ఫేక్ లెక్కలు చూపించడం వల్ల దాన్ని ప్రభావం రానున్న సినిమాలపై కూడా పడవచ్చునని అంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా వుందనేది అర్థమవుతోంది. ఇలా చేయడం వల్ల మన తెలుగు సినిమాల మార్కెట్ పూర్తిగా పడిపోయే అవకాశముంది.

 

 

Tags:    

Similar News