సాహో ని కొంప ముంచుతుంది అదే
మొదటి నాలుగైదు రోజుల్లో సాహో చిత్రం రూ. 330 నుంచి రూ. 350 కోట్లు గ్రోస్ ని కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటన ఇస్తున్నారు. నెగటివ్ టాక్ [more]
మొదటి నాలుగైదు రోజుల్లో సాహో చిత్రం రూ. 330 నుంచి రూ. 350 కోట్లు గ్రోస్ ని కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటన ఇస్తున్నారు. నెగటివ్ టాక్ [more]
మొదటి నాలుగైదు రోజుల్లో సాహో చిత్రం రూ. 330 నుంచి రూ. 350 కోట్లు గ్రోస్ ని కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటన ఇస్తున్నారు. నెగటివ్ టాక్ తో సంబంధం లేకుండా ఈసినిమా దూసుకుపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక్క హిందీ వర్షన్ తప్ప ఈ సినిమా ఎక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. కారణం ఈ సినిమా టికెట్ రేట్స్ ఇంకా 200 రూపాయలకే ఉండడం. 100 రూపాయలు అమ్మాల్సిన టికెట్ ను ముఖ్యంగా ఏపీలో 200 రూపాయలకు అమ్ముతుండడంతో ఈసినిమాను చూడటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకరకంగా ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసి మేజిక్ ఫిగర్స్ సాధించడానికి కారణం ఏపీలో 200 రూపాయలకు టికెట్ అమ్మడమే.
రేట్స్ తగ్గకపోవడంతోనే…
సాహో మీద కాన్ఫిడెన్స్ తో రెండు వారాలకు అనుమతి తెచ్చుకున్న నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు అదే శరాఘాతంగా మారింది. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా రేట్స్ ఇంకా తగ్గకపోవడంతో సాధారణ ప్రేక్షకులు ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకవేళ టికెట్ రేట్ తగ్గిద్దాం అని చుసినా ట్యాక్స్ కట్టే విషయంలో కమిట్ మెంట్ ఇచ్చేయడం వల్ల సాధ్యపడదని కొందరు హాల్ ఓనర్లు వాపోతున్నారు. మరో రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. టికెట్ రేట్స్ పెంచడం ప్లస్ అయినప్పటికీ ఇప్పుడు అదే కొంప ముంచుతోంది.