ప్రభాస్ కొత్త సినిమా ఆగిపోయినట్టేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జాన్ పై సాహో రిజల్ట్ ప్రభావం పడిందని గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో వాస్తవం [more]

Update: 2019-09-29 11:43 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జాన్ పై సాహో రిజల్ట్ ప్రభావం పడిందని గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో వాస్తవం లేకపోలేదని తాజాగా అందుతున్న సమాచారం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క షూటింగ్ ఆల్రెడీ 30 రోజులు జరుపుకుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ఈ కథ షూటింగ్ కూడా యూరప్ లోనే జరిగింది. కథ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి వెళ్లి 30 రోజులు జరుపుకుంటే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ మార్చాలని కోరాడట.

సాహో రిజల్ట్ కారణంగానే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ప్యారిస్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. రావడం రావడమే తన సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ పెట్టిన కండిషన్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి 30 రోజులు చిత్రీకరించిన విజువల్స్ మాటేమిటి? అవి స్క్రాప్ లో వేసినట్టేనా? అంటూ అభిమానుల్లో సందేహం నెలకొంది. ఇందులో ప్రభాస్ రిచెస్ట్ బిజినెస్ మేన్ గా అలానే పూజ ఒక టీచర్ గా కనిపించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రూమర్స్ పై ప్రభాస్ టీం ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News