ఆదివారం వస్తే ఖాళీగా ఉంటాడట..!

వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రేడి అవుతున్నాడు. భారీ డిజాస్టర్స్ తో [more]

;

Update: 2019-03-13 09:47 GMT
సాయితేజ్
  • whatsapp icon

వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రేడి అవుతున్నాడు. భారీ డిజాస్టర్స్ తో ఉన్న ఈ హీరో.. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమా చేసాడు. ఏప్రిల్ 12న విడుదల అంటూ చిత్రలహరి ప్రమోషన్స్ ని వెరైటీగా మొదలు పెట్టింది చిత్రలహరి టీం. నిన్న చిత్రలహరి పాత్రల పరిచయం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసిన టీం.. నేడు చిత్రలహరి టీజర్ ని విడుదల చేసింది. కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా ఈ సినిమాలో సాయి ధరమ్ పక్కన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఆకట్టుకున్న టీజర్

ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రలహరి టీజర్ లోకి వెళితే… అబ్బాయిలంటే సదభిప్రాయం లేని పాత్రలో నివేత పేతురాజ్ కనిపిస్తుంటే కళ్యాణి ప్రియదర్శి మాత్రం క్యూట్ గా కనిపిస్తుంది. ఇక కమెడియన్ సునీల్ కాస్త ఇంట్రెస్టింగ్ పాత్రలో చిత్రలహరిలో దర్శనమిస్తున్నాడు. మరి నాలుగు పాత్రల పరిచయాలతోనే ఆకట్టుకున్న చిత్రలహరి బృందం.. సినిమాతో ఏం అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. గతంలో ప్రతి శుక్రవారం చిత్రలహరి అనే పాటల ప్రోగ్రాం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూండేవారు. ఈ చిత్రలహరి టీజర్ చూసాక.. ఈ మోడరన్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రలహరి సినిమా కోసం ఏప్రిల్ 12 వరకు ఇంట్రెస్టింగ్ గా వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News