అందుకే ఆ హీరోయిన్ ని వదిలేసా..!

ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి రెండుమూడు వరుస సినిమాల్లో నటించారంటే ఆ హీరో, హీరోయిన్ కి లింక్ పెట్టేస్తారు సినీ ప్రియులు. హీరోహీరోయిన్స్ మధ్య ఏదో [more]

Update: 2019-03-27 08:26 GMT

ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి రెండుమూడు వరుస సినిమాల్లో నటించారంటే ఆ హీరో, హీరోయిన్ కి లింక్ పెట్టేస్తారు సినీ ప్రియులు. హీరోహీరోయిన్స్ మధ్య ఏదో నడుస్తుంది… అందుకే ఆ హీరో.. ఆ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశాలిస్తున్నాడు అంటూ ఊదరగొట్టేస్తారు. గతంలో సాయి ధరమ్ తేజ్, రెజినా మధ్య రూమర్స్ నడిపిన గాసిప్ రాయుళ్లు.. మొన్నీమధ్యన నితిన్ కి, మేఘ ఆకాష్ కి లింక్ పెట్టారు. అయితే సాయి ధరమ్ – రెజినా జంటపై మాత్రం రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. సాయి ధరమ్ తాను చేసిన మొదటి సినిమాలో రెజినానే హీరోయిన్. తర్వాత మరో సినిమాలో కలిసి నటించడంతో రెజినాకి, సాయి ధరమ్ కి సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

పుకార్ల వల్లే దూరమయ్యాం

అయితే రెజినాతో ప్రేమ పెళ్లి విషయమై సాయి ధరమ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె పేరు బయటికి రానివ్వకుండా చాలా తెలివిగా స్పందించాడు. ‘‘నా మొదటి సినిమా హీరోయిన్ తో నేను కాస్త క్లోజ్ గా ఉండేవాడిని. ఎవ్వరికైనా ఫస్ట్ సినిమా హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ తో స్పెషల్ గానే ఉంటుంది. అందుకే నేను ఆ హీరోయిన్ తో ఫ్రెండ్లీ గా ఉండేవాడిని. కానీ నాకు ఆ హీరోయిన్ కి లింక్ పెట్టి అర్ధం పర్ధం లేని వార్తలు రావడంతో.. ఆమె కెరీర్ కి ఇబ్బంది రావొచ్చని నేనే ఆమె నుండి దూరంగా ఉంటున్నాను. కేవలం ఆ పుకార్ల వల్ల మా ఫ్రెండ్ షిప్ పాడవడం మాకు ఇష్టం లేకనే ఆమెకు దూరంగా ఉంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. నిజంగానే రెజినా, సాయి ధరమ్ మీద పుకార్లు వచ్చాక వారు మళ్లీ ఎక్కడా కలిసి కనిపించలేదు.

Tags:    

Similar News