మళ్ళీ అదే రేంజ్ లో కనిపిస్తుంది

సాయి పల్లవి అంటేనే నేచురల్ బ్యూటీ, సహజ నటి. కథకు ప్రాధాన్యమున్న సినిమాలతో బాగా హైలెట్ అవుతున్న సాయి పల్లవి పెద్దగా కమర్షియల్ మూవీస్ లో నటించింది [more]

Update: 2021-02-26 13:45 GMT

సాయి పల్లవి అంటేనే నేచురల్ బ్యూటీ, సహజ నటి. కథకు ప్రాధాన్యమున్న సినిమాలతో బాగా హైలెట్ అవుతున్న సాయి పల్లవి పెద్దగా కమర్షియల్ మూవీస్ లో నటించింది లేదు. అయినా సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. కారణం ఆమె నటనే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాలో తెలంగాణా పిల్లగా లంగా వోణి తో అదరగొట్టి.. అమెరికా వెళ్లి ప్యాంటు – షర్ట్ వేసినా.. ఆ పాత్రకి ప్రాణం పోసింది సాయి పల్లవి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తో మరోసారి సాయి పల్లవి అదే లంగా వోణిలో మిడిల్ క్లాస్ అమ్మాయిల ఫిదా చెయ్యబోతున్న విషయం లవ్ స్టోరీ పోస్టర్స్ అండ్ రిలీజ్ చేస్తున్న సాంగ్స్ చూస్తే అర్ధమైపోతుంది.
మరోపక్క వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కతున్న విరాట పర్వం సినిమాలో కాస్త.. లో క్లాస్ గా లంగా వోణిలో సైకిల్ తొక్కుతున్న సాయి పల్లవి ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అటు లవ్ స్టోరీతో మిడిల్ క్లాస్ గాను, ఇటు విరాట పర్వంలో అడవి పిల్లగాను సాయి పల్లవి గెటప్స్ మాత్రం అదుర్స్. అదే గనక ఆమె కాస్త మోడ్రెన్ గా కనిపిస్తే ఇంతిలా హైలెట్ అయ్యేది కాదేమో అనేట్లుగా ఉన్నాయ్ సాయి పల్లవి లుక్స్, అండ్ లంగా వోణి స్టయిల్. చాలా నేచురల్ గా లంగాఓణిలో అద్భుతంగా ఉంది సాయి పల్లవి. ప్రస్తుతం ఏ హీరోయిన్ గురించి ఇంతగా మాట్లాడుకొని సోషల్ మీడియా సాయి పల్లవి విషయాలను మాత్రం బాగా హైలెట్ చేస్తుంది. కారణం ఆమె చేస్తున్న పాత్రలు, ఆమె కనిపిస్తున్న స్టయిల్ కి అందరూ ఫిదా అవుతున్నారు కాబట్టి.

Tags:    

Similar News