ఏ దర్శకనిర్మాత అయినా సాయి పల్లవిని ఆకట్టుకోవాలంటే.. దర్శకుడు చెప్పే కథలో సాయి పల్లవి పాత్ర బాగుండాలి. అంతేకాదు కథ కూడా సాయి పల్లవికి నచ్చితేనే సినిమా చేస్తుంది. కథ నచ్చలేదు, పాత్ర నచ్చేలేదంటే మొహమాట పడకుండా సాయి పల్లవి ఆ సినిమా రిజెక్ట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు, హీరోయిన్స్ పాత్రలు వేరే వాళ్లు చేస్తే ఆ ఫ్లాప్స్ వాళ్ల మెడకు చుట్టుకున్నాయి కూడా. అయితే సాయి పల్లవిని కథతో ఇంప్రెస్స్ చేసి ఆమె పాత్రనే హైలెట్ చేస్తూ కథను డిజైన్ చేసిన నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు మొదలెట్టేశాడు.
మరీ నక్సలైట్ పాత్రలోనా..?
కీలక లీడింగ్ పాత్రలో సాయి పల్లవి, హీరో కానీ హీరో పాత్రలో రానా ఈ సినిమాలో నటిస్తున్నారు. రానా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర వింటే గుండెలు గుబేల్ మంటాయి. కానీ సాయి పల్లవి ఇలాంటి కేరెక్టర్ ఒప్పుకోవడం వింతగా అనిపించదు. వేణు ఉడుగుల డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో సాయి పల్లవి చేసే పాత్రేమిటో తెలుసా... నక్సలైట్ పాత్ర. మరి నక్సలైట్ పాత్ర అంటే మాములు విషయం కాదు... మాస్ పిల్లగా ఇట్టే అతికిపోయే సాయి పల్లవి ఈ మాస్ నక్సలైట్ పాత్రని అలవోకగా చేసెయ్యగలదు కానీ.. మరీ ఇలాంటి పాత్రని సాయి పల్లవి ఎలా ఒప్పుకుందో అనుకొక మానరు. అదే సాయి పల్లవి స్పెషల్ మరి. ఇక ఈ సినిమా కథ నక్సలైట్, పోలీస్ మధ్య నడిచే లవ్ స్టోరీ గా ఉంబోతుందట. నక్సలైట్ గా ఎలాంటి పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుందో అనే డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటి కేరెక్టర్స్ లో సాయి పల్లవి నటనని తక్కువ అంచనా వెయ్యడం కష్టం కనక.