ఫిదా వరుణ్ లాంటి పెళ్ళికొడుకు కావాలట!!

ఫిదా సినిమాలో భానుమతిగా అందరిని ఫిదా చేసి.. త్వరలోనే లవ్ స్టోరీ తో నాగ చైతన్య తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి అంతే [more]

Update: 2020-04-01 06:00 GMT

ఫిదా సినిమాలో భానుమతిగా అందరిని ఫిదా చేసి.. త్వరలోనే లవ్ స్టోరీ తో నాగ చైతన్య తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి పల్లవి అంతే పిచ్చ క్రేజుంది తెలుగు ప్రేక్షకుల్లో. ఫిదా బహనుమతిగా తెలంగాణ పిల్లగా అందరికి దగ్గరయిన సాయి పల్లవి సినిమా అంటే ప్రేక్షకులకు పిచ్చ క్యూరియాసిటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. కరోనా కల్లోలంతో ఆ సినిమా వాయిదాపడేలా ఉంది. అయితే సాయి పల్లవి యాక్ట్రెస్ కాకముందే డాక్టర్. సాయి పల్లవి మంచి డాన్సర్ కూడా. ఇక సినిమాల్లోకి వచ్చిన సాయి పల్లవి మంచి కథ బలమున్న సినిమాల్తో క్రేజ్ సంపాదించుకుంది. మాధురి దీక్షిత్, ఐశ్వర్య ల ను చూసి డాన్స్ అంటే ఇష్టం పెంచుకున్న సాయి పల్లవి ఖాళీ సమయంలో డాన్స్ చేస్తుంటుంది.

ఇక మీకు కాబోయే వరుడు ఎలా ఉండాలి అని అడిగితె.. దానికి సాయి పల్లవి ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి కనబడితే వెంటనే ఐ లవ్ యు చెప్పేసి… పెళ్లి చేసుకుందామని అడుగుతా అంటుంది. ఫిదా సినిమాలో అగ్రికల్చర్ స్టూడెంట్ గా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే చిలిపి అమ్మాయి పాత్రలో సాయి పల్లవి ఇరగదియ్యగా… సాయి పల్లవిని చూసి మనసు పారేసుకుని.. ఆమె కోసం తన కలనే త్యాగం చేసే కుర్రాడిగా వరుణ్ తేజ్ పాత్ర అద్భుతం. మరి అలాంటి అబ్బాయి అయితే సాయి పల్లవి నిజ జీవితంలో పెళ్లి కొడుకుగా యాక్సెప్ట్ చేస్తుందట. ఇక ఒక తమిళ సినిమాలో చేసిన సీన్ ని పదే పదే రీ షూట్ చెయ్యడంతో బాగా అలిసిపోయిన నేను.. ఇక సినిమాలు చెయ్యనని అమ్మకి చెప్పి గట్టిగా ఏడ్చేసానని.. కానీ దర్శకుడు ఆ సీన్ బాగా రావడం కోసమే ఆ సీన్ పదే పదే షూట్ చేయించాడని ఆర్ద్రమై నేను ఆయనని అర్ధం చేసుకున్న అంటుంది సాయి పల్లవి.

Tags:    

Similar News