ఏదో సిట్యుయేషన్ డిమాండ్ చేసింది.. ఆ డ్రెస్ వేసా?
సాయి పల్లవి నటనకు ఆమె అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిదా నే. సాయి పల్లవి నటన, డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. సాయి పల్లవి గ్లామర్ [more]
సాయి పల్లవి నటనకు ఆమె అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిదా నే. సాయి పల్లవి నటన, డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. సాయి పల్లవి గ్లామర్ [more]
సాయి పల్లవి నటనకు ఆమె అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిదా నే. సాయి పల్లవి నటన, డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. సాయి పల్లవి గ్లామర్ షో చెయ్యదు.. కానీ ఆమెకి కథ బలమున్న మంచి సినిమాలు వస్తున్నాయి. అయితే మొదటినుండి గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి.. అందాలు ఆరబొయ్యకపోవడంతో ఆమెకి అవకాశాలు రావడం లేదు అని అంటుంటారు. కానీ కాదు… సాయి పల్లవే చాలా సినిమాలు ఒప్పుకోవడం లేదట. ఆ మాట సాయి పల్లవి చాలా సందర్భాలలో చెప్పింది. గ్లామర్ విషయంలో తాను అనుకున్న పరిధి దాటే ప్రసక్తే లేదంటుంది.
అయితే ఫిదా సినిమాలో అమెరికాలో పబ్ సీన్ లో సాయి పల్లవి ఓ గ్లామర్ డ్రెస్ తో అందాల ఆరబోత విషయమై అడగగా.. ఆ సీన్ డిమాండ్ చేసింది గనక అప్పుడు ఆ డ్రెస్ వేసాను. అలాగే మరో సినిమాలో అలా గ్లామర్ గా కనిపించాలంటే మాత్రం ఒప్పుకోను. ఫస్ట్ నుండి ఓ కాలేజ్ అమ్మాయిలా సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతాను. కానీ గ్లామర్ గా చిన్న పొట్టి దుస్తులు వేసుకుని.. వయ్యారంగా అందాలు ఆరబొయ్యడం లాంటివి నాకు ఇష్టం ఉండవు. గ్లామర్ గా నటించాలి.. పొట్టి బట్టలేసుకోవాలని ఒత్తిడి చేస్తే ఆ సినిమాలు ఒప్పుకోను. అలాంటి సినిమాలు చాలానే వదులుకున్నా అని చెబుతుంది సాయి పల్లవి.