సైరా హిందీ వర్షన్ ఎవరు తీసుకున్నారు అంటే
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా చిత్రం పాన్ ఇండియా చిత్రం కావాలని మొదటినుండి టీం భావిస్తుంది. అందుకే ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ [more]
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా చిత్రం పాన్ ఇండియా చిత్రం కావాలని మొదటినుండి టీం భావిస్తుంది. అందుకే ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ [more]
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా చిత్రం పాన్ ఇండియా చిత్రం కావాలని మొదటినుండి టీం భావిస్తుంది. అందుకే ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలని తీసుకున్నారు. ఈ మూవీని హిందీ లో భారీ లెవెల్ లో రిలీజ్ చేయాలనీ సైరా టీం భావిస్తుంది. బాహుబలి మాదిరిగా ఈచిత్రంకి కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ తీసుకురావాలను కుంటున్నారు. బాలీవుడ్ లో భారీ రిలీజ్ కోసం అక్కడ పెద్ద నిర్మాణ సంస్థలతో ముందు నుంచి చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కరణ్ జోహార్ తో డీల్ సెట్ చేద్దాం అని చూసారు కానీ సెట్ కాలేదు.
బజ్ తీసుకురావాలని…..
సో వేరే పెద్ద సంస్థలు కోసం సెర్చ్ చేస్తున్న టైములో దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్.. అనిల్ తడాని నడిపించే ఏఏ ఎంటర్ప్రైజెస్ సంస్థలు సైరాను టేకప్ చేసాయి. గతంలో ఈ రెండు సంస్థలు కేజీఎఫ్ చిత్రాన్ని ఎంత బాగా ప్రమోట్ చేసి భారీగా రిలీజ్ చేసారో మనం చూసాం. ఇప్పుడు వీరు సైరా ను తీసుకున్నారు కాబట్టి అదేవిధంగా బజ్ తీసుకుని వస్తారు అని భావిస్తున్నారు సైరా టీం. రీసెంట్ గా ఈ డీల్ గురించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసారు. అయితే హిందీ వర్షన్ ఎంత మొత్తానికి అమ్మారో మాత్రం చెప్పలేదు. అన్ని అంచనాల మధ్య ఈమూవీ అక్టోబర్ 2 న రిలీజ్ అవుతుంది.