కలెక్షన్ల కోసమే కలయికలా…..?

సైరా నర్సింహారెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సినిమా పేరు మారుమోగిపోతోంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం రెండురోజుల మొదట్లో కలెక్షన్లే కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత [more]

Update: 2019-10-11 10:57 GMT

సైరా నర్సింహారెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సినిమా పేరు మారుమోగిపోతోంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం రెండురోజుల మొదట్లో కలెక్షన్లే కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కలెక్షన్లు పడిపోయాయి. దీనికి తోడు గద్దలకొండ గణేష్, వాల్మీకి సినిమాలు కూడా పోటీగా ఉండడంతో సైరాపై కలెక్షన్లు తగ్గిపోయాయి. ఒక సినిమా కిక్ ఇస్తే ప్రేక్షకుడు అదే సినిమాను నాలుగైదు సార్లు చూస్తాడు. దీంతో సినిమా డిస్టిబ్యూటర్లకూ కలెక్షన్ల పంట పండుతుంది. కాని ఇప్పుడు సైరా పరిస్థితి వేరుగా కనిపిస్తోంది.

సైరాకు ఎదురుదెబ్బ

సైరా సినిమాకు సుమారు 270 కోట్లు ఖర్చు చేశారు. కాని 9 రోజుల్లో కలెక్షన్లు 92.64కోట్లు మాత్రమే వసూలైంది. కనీసం 9 రోజుల్లో ఖర్చులో సగం కూడా వసూళ్లు రాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద దెబ్బే. తెలుగు సినిమాల చరిత్రలోనే రాజమౌళి నిర్మించిన బాహుబలి రెండు పార్టుల చిత్రాలకు భారీగా ఖర్చు చేశారు. ఆ సినిమా క్లిక్ కావడంతో జనం ఎగబడి చూశారు. బాహుబలి పార్ట్ 1 సినిమా వచ్చిన తరువాత ఏడాదికి రెండో పార్ట్ వచ్చింది. అప్పటి వరకు ప్రేక్షకులు ఎదరుచూశారు. ఈ సినిమాకు వెయ్యి కోట్లు చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే వచ్చింది. అలానే సైరాకు కూడా వసూళ్ల కలెక్షన్లు వస్తాయని అందరూ భావించారు. కాని సైరాకు ఎదురుదెబ్బే తగిలింది.

టాక్ వస్తేనైనా చూస్తారా…..?

సైరా సినిమాపై టాక్ వస్తే నైనా కనీసం జనం సినిమా చూస్తారేమోనని సైరా టీం భావిస్తోంది. దీంతో తరచూ ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం కావడం, ఈ సైరా సినిమాకు ఆయన తనయుడు రాంచరణ్ నిర్మాత కావడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాకు కలెక్షన్లు రాకపోవడంతో ఆ తరువాత ఏం చేయాలనే దానిపై సైరా టీం చర్చించినట్లు తెలిసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రాంచరణ్ లు సైరా సినిమాపై ప్రచారం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత రాంచరణ్ సినిమాకు ఎక్కడ రాజీ పడకుండా బడ్జెట్ కు వెనకాడకుండా జాగ్రత్తలు తీసుకుని ఖర్చు చేశారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వారు డిజైన్ చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉండడంతో సైరా సినిమాపై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. జనాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరూ కూడా దియేటర్లకు వెళ్లలేదు.

కలిసొచ్చేనా…..

కొద్ది రోజులుగా సైరా టీం సినిమాపై విస్రృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి సైతం తెలంగాణ గవర్నర్ తమిళసై ను మర్యాద పూర్వకంగా కలిసి సైరా చిత్రం చూడాలని కోరారు. అదే విధంగా ఏపీ సీఎం జగన్ ను కూడా కలిసేందుకు చిరంజీవి, రాంచరణ్ లు అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల 14న చిరంజీవి, రాంచరణ్ లు జగన్ ను కలువనున్నారు. జగన్ కు కూడా సైరా చిత్రం చూడాలని కోరనున్నారు. ఇలా ప్రముఖులను కలిస్తే కొంత ప్రచారం జరిగి జనం సినిమాను చూస్తారనే భావనలో సైరా టీం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

Tags:    

Similar News