పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్?

పవన్ కళ్యాణ్ సీనియాల్లోకి రావడం రావడం వరస సినిమాలను లైన్ లో పెట్టేసి ఫాన్స్ కి షాకిద్దామనుకుంటే… పవన్ కళ్యాణ్ కి కరోనా లాక్ డౌన్ షాకిచ్చింది. [more]

Update: 2020-05-15 04:40 GMT

పవన్ కళ్యాణ్ సీనియాల్లోకి రావడం రావడం వరస సినిమాలను లైన్ లో పెట్టేసి ఫాన్స్ కి షాకిద్దామనుకుంటే… పవన్ కళ్యాణ్ కి కరోనా లాక్ డౌన్ షాకిచ్చింది. వకీల్ సాబ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఓకె చెప్పేసాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ తో పూరి సినిమా అంటున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని రీమేక్ చేస్తున్నాడనే న్యూస్ నడుస్తుంది. ఓ బడా నిర్మాత పవన్ కళ్యాణ్ తో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చెయ్యడానికి ప్లానింగ్ లో ఉన్నాడని పవన్ ని ఒప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నాడంటున్నారు.

మలయాళ డ్రైవింగ్ లైసెన్స్ లో పృథ్వీ రాజ్ మరియు సూరజ్ వెంజరమూడు ల ప్రధాన పత్రాలు పోషించారు. అయితే తెలుగులో రీమేక్ చేస్తే ఓ పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తే మరో పాత్ర మెగా హీరో మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తాడంటూ ఓ న్యూస్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మెగా హీరోలంతా ఎప్పుడూ సిద్దమే. మరి సాయి తేజ్ కి అవకాశం రావాలె కానీ ఎగిరి గంతేయ్యడూ.. అయితే ఇందులో నిజమెంతుందో ఇంకా క్లారిటీ అయితే లేదు.

Tags:    

Similar News