Sriya Reddy : పవన్ అలాంటి వ్యక్తి అని తెలియదు.. సలార్ భామ కామెంట్స్..

OG సెట్స్ కి వెళ్లెవరకూ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి అని నాకు తెలియదు. సలార్ భామ శ్రియారెడ్డి వైరల్ కామెంట్స్.;

Update: 2023-12-24 06:24 GMT
Salaar, Sriya Reddy, Pawan Kalyan, OG Movie, pawan kalyan news, movie news, OG Movie news, OG updates, salaar updates

Sriya Reddy about Pawan Kalyan

  • whatsapp icon

Sriya Reddy : తమిళ నటి శ్రియారెడ్డి.. ప్రభాస్ సలార్ సినిమాలో ముఖ్య పాత్ర చేసి ప్రస్తుతం నేషనల్ వైడ్ వైరల్ అవుతున్నారు. శ్రియారెడ్డి ఈ మూవీ కంటే ముందే తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. శ్రియారెడ్డి తెలుగు సినిమా 'అప్పుడప్పుడు' సినిమాతోనే పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ 'అమ్మ చెప్పింది' సినిమాలో కూడా ముఖ్య పాత్ర చేశారు. అయితే తమిళ హీరో విశాల్ నటించిన 'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి నెగటివ్ పాత్రలో ఓ రేంజ్ యాక్టింగ్ చేసి.. తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు సలార్ మూవీతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపుని సంపాదించుకున్నారు.

సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా రాధారామ పాత్రలో శ్రియారెడ్డి కనిపించారు. ఈ మూవీలో శ్రియారెడ్డి యాక్టింగ్‌కి, లుక్స్‌కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ వస్తున్నారు. ఇక సలార్ ప్రమోషన్స్ లో ఉన్న శ్రియారెడ్డి ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూవీ OG, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ OG లో శ్రియారెడ్డి ముఖ్య పాత్ర చేస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రియారెడ్డి మాట్లాడుతూ.. "OG కోసం సుజిత్ అదిరిపోయే కథని రాశారు. ఈ సినిమాలో నేను నటిస్తునందుకు ఎంతో ఆనందిస్తున్నా. ఈ మూవీలోని నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి, కానీ నెగెటివ్‌ రోల్‌ కాదు" అంటూ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "ఆయన అంత పెద్ద స్టార్ అని అనుకోలేదు. OGకి నేను ఎంపిక అయ్యేవరకు ఆయన అంత పెద్ద స్టార్‌డమ్‌ ఉన్న వ్యక్తి అని నాకు తెలియలేదు. ఈ చిత్రంలో నేను నటిస్తున్నాను అని ఆడియన్స్ కి తెలిసిన తరువాత నేను ఎక్కడికి వెళ్లినా.. 'మీరు మా దేవుడి సినిమాలో నటిస్తున్నారా' అని అడుగుతూ వస్తున్నారు. ఆయనకి ఉన్న విశేష ప్రజాధారణ చూసి ఆశ్చర్యం వేసింది. అలాంటి స్టార్ తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషం ఉంది. ఆయన చాలా మంచి మనసు కలిగినవారు. ఇతరులతో చాలా చక్కగా మాట్లాడతారు" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News