సలార్ సంచలనాలకు సరిహద్దులు లేనట్టే.!

సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరిలో ఆసక్తి రేపిన ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాలో ప్రభాస్ ని మాస్ గా పవర్ ఫుల్ పాత్రలో [more]

Update: 2020-12-16 16:46 GMT

సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరిలో ఆసక్తి రేపిన ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాలో ప్రభాస్ ని మాస్ గా పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడని అర్ధమైంది. అయితే ప్రభాస్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ప్లన్స్ మాములుగా లేవు. ప్రభాస్ క్రేజ్ మాత్రమే సినిమాకి సరిపెట్టకుండా ప్రశాంత్ నీల్ సలార్ కోసం ఇంకొన్ని భారీ ఏర్పాట్లు చేయబోతున్నాడట. అంటే క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగా సలార్ ని మార్చబోతున్నాడట ప్రశాంత్ నీల్. అంటే సలార్ లో భారీ బడ్జెట్ తో పాటుగా భారీ తారాగణం ఉంటుంది అని.. ఇప్పటికే టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి పేరు సలార్ సినిమా కోసం గట్టిగా వినిపిస్తుంది.

సలార్ లో ప్రభాస్ కి క్రేజ్ కి తగ్గట్టుగా  మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో భాగమైతే అంచనాలు మాములుగా ఉండవని ప్రశాంత్ నీల్ మోహన్ లాల్ ని ఈ సినిమాలో భాగం చేస్తే.. సౌత్ మొత్తానికి అటు హిందీకి లో కూడా సినిమాపై క్రేజ్ వస్తుంది అని భావిస్తున్నాడట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ మోహన్ లాల్ ని కలిసి సలార్ స్క్రిప్ట్ వినిపించాడని.. దానికి మోహన్ లాల్ కూడా సానుకూలంగా స్పందించారని న్యూస్ నడుస్తుండగా.. ఈ సినిమా కోసం మోహన్ లాల్ కి సలార్ మేకర్స్ భారీ పారితోషకం ఆఫర్ చేసారంటున్నారు. మోహన్ లాల్ కి సలార్ లో నటించేందుకు దాదాపుగా 20 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టుగా  తెలుస్తుంది.  మరి సలార్ లో మోహన్ లాల్ అంటే.. సినిమాపై భారీ అంచనాలు పెరగడం ఖాయం.

Tags:    

Similar News