ఫ్యామిలిలో ఎలాంటి గొడవలు లేవంటున్న అక్కినేని కోడలు

నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడిన సమంత… ఇప్పటివరకు తన తల్లితండ్రులతో కలిసున్న సందర్భాన్ని కానీ, వారితో పంచుకున్న క్షణాల్ని కానీ, కనీసం చైతు సామ్ పెళ్ళిలో [more]

Update: 2019-05-19 04:07 GMT

నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడిన సమంత… ఇప్పటివరకు తన తల్లితండ్రులతో కలిసున్న సందర్భాన్ని కానీ, వారితో పంచుకున్న క్షణాల్ని కానీ, కనీసం చైతు సామ్ పెళ్ళిలో సమంత పేరెంట్స్ ఉన్నట్లుగా ఎవరికీ తెలియదు. కేవలం అక్కినేని, దగ్గుబాటి ఫామిలీస్ మాత్రమే చైతు, సామ్ పెళ్ళిలో హడావిడి చేశాయి. ఇక సమంత చిన్నప్పటినుండి చాలా కష్టపడి మోడల్ గా హీరోయిన్ గా టాప్ రేంజ్ కి చేరి ఇప్పుడు సర్వసుఖాలు అనుభవిస్తుంది. అయితే చాలారోజులనుండి సమంత తల్లితండ్రులతో సమంతకి ఏవో విభేదాలున్నాయని న్యూస్ ప్రచారంలోఉంది. సమంత అందుకే తన పేరెంట్స్ విషయాలేమి బయటికి పొక్కకుండా గుంభనంగా ఉంటుందని అంటారు.

అయితే తనకి తన తల్లికి మధ్యన ఎలాంటి పొరపొచ్చాలులేవని సమంత తాజా ట్వీట్ చూస్తే తెలుస్తుంది. సమంత ఇన్ స్టాలో తన తల్లి ఫోటో ని షేర్ చెయ్యడమే కాదు… తన గురించి తన తల్లి దేవుణ్ణి చిన్నప్పటినుండి ప్రార్థిస్తూ ఉంటుందని.. తన తల్లి చేసే ప్రార్ధనలో ఏదో మాయ ఉంటుందని.. ఇక ఇప్పుడు కూడా తన కోసం తన తల్లిని దేవుణ్ణి ప్రార్ధించమని అడుగుతున్నానని.. తనకి దేవుడు మొదటి దైవమైతే.. తన తల్లి రెండో దైవమంటూ పోస్ట్ చేసింది. మరి దీని బట్టి సమంత కి తన పేరెంట్స్ కి మధ్యన విభేదాలేమి లేవనిపిస్తుంది. కావాలనే వారు కాస్త ప్రవేట్ లైఫ్ ని కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.

Tags:    

Similar News