సమంత గ్లామర్ హీరోయిన్.. కానీ

అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టినాక కూడా గ్లామర్ షో లో ఎలాంటి పొదుపు పాటించని సమంత మిడ్డీ వేసినా, బికినీ వేసినా సమంత గ్లామర్ షోకి సలాం [more]

Update: 2020-12-25 07:06 GMT

అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టినాక కూడా గ్లామర్ షో లో ఎలాంటి పొదుపు పాటించని సమంత మిడ్డీ వేసినా, బికినీ వేసినా సమంత గ్లామర్ షోకి సలాం కొట్టాల్సిందే. అక్కినేని అభిమానులు గోల పెడుతున్నారని.. సమంత పెళ్లి తర్వాత గ్లామర్ షో చెయ్యడం మానలేదు. పెళ్లయినా సమంత పద్దతి మార్చలేదు. ఇప్పటికీ గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గదు. అయితే అంత గ్లామర్ గర్ల్ రంగస్థలంలో డీ గ్లామర్ గా రామలక్ష్మి పాత్ర చేసినా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కానీ సినిమా లో సమంతని రామలక్ష్మి పాత్రకి అనుకున్నప్పుడు ఇంత గ్లామర్ గర్ల్ ని అలా రామలక్ష్మిగా ప్రేక్షకులు ఒప్పుకోరేమో అని అసిస్టెంట్ డైరెక్టర్స్ సందేహాలు వెళ్లబుచ్చారట. అందుకే ఆ పాత్రకి సమంతని వద్దని కూడా చెప్పారట.

గ్లామర్ షో చేసే హీరోయిన్స్ ఇలాంటి డీ గ్లామర్ పాత్రలకి పనికిరారనేది వారి అభిప్రాయం. అసలు సుకుమార్ రంగస్థలంలో రామలక్ష్మి పాత్రకి సమంతని సంప్రదించినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యిందట. రామలక్ష్మి పాత్రని ఛాలెంజింగ్ తీసుకున్నానని.. సినిమా విడుదలయ్యాక ఆ పాత్రకి ఎంతగా పేరొచ్చిందో క్రిష్ -రకుల్ పాల్గొన్న సామ్ జామ్ షోలో సమంత బయటపెట్టింది.

Tags:    

Similar News