అందరికి భిన్నంగా సమంత మాత్రం..?

కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అందరూ జిమ్ లు, యోగాలు, వంటలు అంటూ సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది వెరైటీ వర్కౌట్స్ తో సోషల్ మీడియాని షేక్ [more]

Update: 2020-05-09 04:06 GMT

కరోనా లాక్ డౌన్ లో హీరోయిన్స్ అందరూ జిమ్ లు, యోగాలు, వంటలు అంటూ సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది వెరైటీ వర్కౌట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. హాట్ హాట్ యోగ షేప్స్ లో అదరగొడుతున్నారు. అయితే సమంత మాత్రం భర్త నాగ చైతన్య చేసే వంటకాను ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తుంది. చైతు వంటలను టేస్ట్ చేస్తూ ఇంట్లో సేదతీరుతున్న సమంత మాత్రం ఇప్పుడు హీరోయిన్స్ అందరికి భిన్నంగా ట్రై చేస్తుంది.

పెళ్లి తర్వాత అభినవ హీరోయిన్ గా పేరు గడించి.. ఏ కేరెక్టర్ అయినా దున్నేస్తుంది అనుకున్న  సమంత ఇప్పుడు అందరికి షాకిచ్చింది. తెలుగులో సినిమాలు ఒప్పుకోకుండా., తమిళనాట కూడా సస్పెన్సు లో పెట్టిన సమంత బాలీవుడ్ లో మాత్రం వెబ్ సీరీస్ లో నటించింది. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో అందరిలా కాకుండా సమంత మాత్రం ఆన్ లైన్ క్లాసులో జాయిన్ అయింది. అది కూడా నటనలో మెళకువలు నేర్చుకోవడానికి అంటూ చెబుతుంది. కరోనా లాక్ డౌన్ పూర్తయ్యేలోగా మంచి యాక్టర్ అవుతానని అనుకుంటున్నానని… ఒకవేళ కాకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ డిలేట్ చేస్తా అంటూ చెబుతుంది.

Tags:    

Similar News