చైతు ఐడియాకి నాగ్ ఓకే చెబుతారా?

నాగార్జున హోమ్ బ్యానర్ అయినా అన్నపూర్ణ స్టూడియోస్‌ పై తరచూ ఏదొక సినిమా వస్తూనే ఉంటుంది. దీనిపై తీసే సినిమాలకి కుటుంబ సభ్యులలో చాలా మందిని భాగస్వాములని [more]

Update: 2019-06-04 05:52 GMT

నాగార్జున హోమ్ బ్యానర్ అయినా అన్నపూర్ణ స్టూడియోస్‌ పై తరచూ ఏదొక సినిమా వస్తూనే ఉంటుంది. దీనిపై తీసే సినిమాలకి కుటుంబ సభ్యులలో చాలా మందిని భాగస్వాములని చేస్తూ అప్పటిలో అక్కినేని నాగేశ్వరరావు విల్లు రాసారట. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టీవ్ సినిమాలు చేసేది మాత్రం నాగార్జున ఫ్యామిలీ ఒక్కటే.

అందుకే వారు మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అంటూ విడిగా ఓ సంస్థ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పదో వంతు రాయల్టీని మాత్రమే అన్నపూర్ణా స్టూడియోస్‌కి ఇస్తున్నారు. ఈ బ్యానర్ నాగార్జున కంట్రోల్ లో ఉంటుంది. తానూ హీరో గా చేసే సినిమాలు..వాటి ప్రాఫిట్స్…వాటి బడ్జెట్‌ వ్యవహారాలు, ఖర్చులు అన్ని చైతు పర్యవేక్షించినా కానీ నిర్మాతగా అతనికి హోదా వుండదు.

చైతు ఎప్పటినుండో కొత్త కాన్సెప్ట్స్ తో కొత్త టాలెంట్ తో సినిమాలు చేయాలనీ చూస్తున్నాడు. ఇవి పై రెండు బ్యానర్స్ లో తీయడానికి సాధ్యపడదు కాబట్టి సమంత-చైతన్య కలిసి వేరే బ్యానర్‌ స్థాపించే ఆలోచనలో వున్నారట. ఈ బ్యానర్ లో అయిదారు కోట్లలో తీసే చిన్న సినిమాలనుంచి, తామిద్దరం కలిసి నటించే చిత్రాల వరకు ఇందులో చేయాలనే ఐడియా తో ఉన్నారు. ఈ ప్రపోజల్ నాగార్జున ముందు పెట్టారట. నాగ్ ఓకే అంటే త్వరలోనే వీరి బ్యానర్ లో ఓ చిన్న సినిమా వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News