పుష్ప ట్రైలర్‌పై సమంత ట్వీట్.. బంగార్రాజు సంగతేంటి ?

టాలీవుడ్ జెస్సీ గా పేరొందిన సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏదొక పోస్ట్ తో వార్తల్లో నిలుస్తోంది.

Update: 2021-12-07 05:56 GMT

టాలీవుడ్ జెస్సీ గా పేరొందిన సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏదొక పోస్ట్ తో వార్తల్లో నిలుస్తోంది. సమంత ట్వీట్ చేసినా, ఇన్ స్టా లో పోస్ట్ పెట్టినా అవి నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. పుష్ప ట్రైలర్ పై సమంత స్పందించింది. సోమవారం సాయంత్రమే పుష్ప ట్రైలర్ ను విడుదల చేయగా.. దానీపై సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

రీట్వీట్ చేసి....
పుష్పరాజ్.. తగ్గేదే లే.. అంటూ అల్లు అర్జున్ చేసిన ట్రైలర్ రిలీజ్ ట్వీట్ ను రీ-ట్వీట్ చేసింది సమంత. పుష్ప - ది రైజ్ 01.. డిసెంబర్ 17న థియేటర్లలోకి వస్తోందంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టింది. ఐతే సమంత ట్వీట్ ను సమంత ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకోగా.. అక్కినేని- సమంత ఉమ్మడి అభిమానులు మాత్రం డిఫరెంట్ గా రియాక్టవుతున్నారు.
ఆ పాట పై మాత్రం..
బంగార్రాజు సినిమాలో నాగచైతన్య-కృతి శెట్టిపై తీసిన 'నాకోసం' పాట ఇటీవలే విడుదలవ్వగా.. ఈ పాటను సిరివెన్నెల రచించారు. పుష్ప ట్రైలర్ పై అంత త్వరగా స్పందించిన సమంత.. ఈ పాటపై ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వడం లేదని చై - సామ్ అభిమానులు కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాము భార్య భర్తలుగా విడిపోతున్నాం.. కానీ స్నేహితులుగా ఉంటామని ఇద్దరూ చెప్పారు. దీంతో బంగార్రాజు సంగతేంటి ? అని ఫొటోలు పెట్టి ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News