అది సాధ్యమేనా?

పెళ్లి తర్వాత సమంత మనసుకు నచ్చిన సినీమాలు చేస్తుంది. ఈ ఏడాది కేవలం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తప్ప మరో సినిమా ఒప్పుకొని సమంత తమిళనాట [more]

Update: 2020-08-10 04:39 GMT

పెళ్లి తర్వాత సమంత మనసుకు నచ్చిన సినీమాలు చేస్తుంది. ఈ ఏడాది కేవలం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తప్ప మరో సినిమా ఒప్పుకొని సమంత తమిళనాట విజయ్ సేతుపతి సినిమా నుండి కూడా బయటికి వచ్చేసినట్టుగా టాక్ ఉంది. చాలామంది దర్శకనిర్మాతలు అటు సినిమాల కోసము, ఇటు వెబ్ సీరీస్ ల కోసం సమంత వెంటపడుతుంటే సమంత మాత్రం ఎవ్వరికి కమిట్మెంట్ ఇవ్వడం లేదు. ఆలాంటి టైం లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రశ్మికతో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అనే న్యూస్ నడుస్తుంది.

తెలుగులో తార జువ్వలా దూసుకొచ్చి.. స్టార్ హీరోల సినిమాల అవకాశాలు పట్టేస్తున్న రష్మిక – పెళ్లి తర్వాత గ్లామర్ పరంగా దూసుకుపోతున్న సమంత కలిసి అక్కచెల్లెళ్లుగా ఓ సినిమాలో నటించబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల కథతో సమంత, రష్మికలను సంప్రదించాడనీ,.. కథ నచ్చిన రష్మిక – సమంత ఇద్దరూ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా హీరోయిన్స్ ఓరియెంటెడ్ గా ఉండబోతుంది అని అందుకే సమంత కూడా ఒప్పుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ప్రస్తుతం సినిమాలు ఒప్పుకొని సమంత – స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న రష్మిక కలిసి నటిస్తే ఆ సినిమాకి క్రేజే క్రేజు. కానీ అది సాధ్యమేనా అంటున్నారు.

Tags:    

Similar News