సమంత కూడా తప్పుగా అర్ధం చేసుకుందా?

గత రెండు రోజులుగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని చుట్టు ముట్టింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ [more]

Update: 2020-09-14 04:57 GMT

గత రెండు రోజులుగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని చుట్టు ముట్టింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు ఎన్ సీబీ ఎదుట బయటపెట్టింది అని, అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీ ఖాన్ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో బయటికి వచ్చింది అని ప్రముఖ టైమ్స్ నౌ ఛానల్ లో ప్రసారమవగా.. రకుల్ ప్రీత్ పై అందరిలో ఆనుమానాలు మొదలవడమే కాదు… టాలీవుడ్ మీడియా ఏకంగా రకుల్ ఇంటిని చుట్టముట్టడం, ఆమె షూటింగ్ చేసుకుంటున్న వికారాబాద్ అడవులకు వెళ్లి హడావిడి చెయ్యడం, రకుల్ మీడియా కి మొహం చాటేసి.. క్రిష్ సినిమా షూటింగ్ నుండి అర్ధాంతరముగా వెళ్ళిపోయింది అనే ప్రచారం మాములుగా జరగలేదు. రకుల్ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె మేనేజర్ చెప్పినా ఎవరూ వినలేదు.

ఇంకేంటి రకుల్ కి అసలే అవకాశాలు లేవు. ఇక ఈ డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ ఎదుర్కొంటే ఆమె కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు. అందరూ రకుల్ ప్రీత్ ని డ్రగ్స్ తీసుకున్న హీరోయిన్ గా తప్పుగానే అర్ధం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసుతో రకుల్ ప్రీత్ కి కానీ సారా అలీఖాన్ కి కానీ సంబంధం లేదని ఎన్ సీబీ అధికారులు స్పష్టం చేసారు. అసలు ఈ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి రకుల్ పేరు కానీ, శర అలీ ఖాన్ పేరు కానీ బయటపెట్టలేదని చెప్పడంతో మీడియా అవాక్కయ్యింది. లేదంటే రియా చక్రవర్తి – రకుల్ కలిసున్న ఫొటోస్, వాళ్లిద్దరూ జిమ్ చేస్తున్న, యోగ చేస్తున్న వీడియోస్ తో గత రెండు రోజులుగా టాలీవడో మీడియాఛానల్స్ లో మార్మోగిపోయాయి.

ఇక ఎన్ సీబీ అధికారులు రకుల్ పేరు, సారా పేరు ఈ డ్రగ్స్ కేసులో బయటికి రాలేదని కొట్టిపారెయ్యగానే.. రకుల్ ని సారా ని తప్పుగా అర్ధం చేసుకున్న నెటిజెన్స్ ఒక్కొక్కరిగా రకుల్ కి సారా కి క్షమాపణలు చెబుతున్నారు. అందులో టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఉంది. గత రాత్రి సమంత తన ఇన్స్టా లో రకుల్ ప్రీత్ కి సారా అలీ ఖాన్ కి సారీ చెబుతూ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరిలా సమంత కూడా రకుల్ ని తప్పుగా అర్ధం చేసుకుందా? తప్పుగా అనుకునందుకు రకుల్ సారి అంటూ నెటిజెన్స్ సారి చెప్పిన టైం లోనే టాప్ హీరోయిన్ సమంత కూడా సారి చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News