Samantha Comments : అల్లు అర్జున్‌తో సూపర్ హీరో మూవీ చేస్తా..
అల్లు అర్జున్‌తో ఒక సూపర్ హీరో చేస్తాను అంటున్న హీరోయిన్ సమంత.;
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇటీవల మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలు వెళ్లి తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇక వచ్చిన దగ్గర నుంచి కమర్షియల్ యాడ్ షూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ బిజీబిజీగా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్.. హాలీవుడ్ మూవీ ‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ కోసం కూడా ముందుకు వచ్చింది. 2019లో వచ్చిన ‘కెప్టెన్ మార్వెల్’కి ఇది సీక్వెల్ గా వస్తుంది. కెప్టెన్ మార్వెల్ సినిమా రిలీజ్ సమయంలో కూడా సమంత ప్రమోషన్స్ చేసింది.
ఇప్పుడు ‘ది మార్వెల్స్’ మూవీ ప్రమోషన్స్ భాద్యతని కూడా సమంతనే తీసుకుంది. ఈక్రమంలోనే తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి సందడి చేసింది. ఇక ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ.. తను మార్వెల్ సూపర్ హీరో అయితే, ఎవరితో కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడతోందో అనేది తెలియజేసింది. ముందుగా.. తన ఫ్యాన్స్ తో కలిసి ఈ వరల్డ్ ని సేవ్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
ఒకవేళ ఇండస్ట్రీ వ్యక్తులతో ప్రపంచాన్ని కాపాడాలంటే ఎవరితో కలిసి సేవ్ చేస్తారని ప్రశ్నించగా, సమంత బదులిస్తూ.. "అల్లు అర్జున్ తో సూపర్ హీరోగా మారి వరల్డ్ ని సేవ్ చేస్తా. అలాగే విజయ్, అలియా భట్, ప్రియాంక చోప్రాతో కలిసి ప్రపంచాన్ని కాపాడుతాను" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అర్జున్, సమంత ఒక మార్వెల్ రేంజ్ సూపర్ హీరో మూవీ వస్తే సూపర్ ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత తన జీవితంలో ఉన్న సూపర్ హీరోల గురించి కూడా తెలియజేసింది. తన అమ్మ, తన స్నేహితులు, తను పేస్ చేసే ప్రాబ్లెమ్స్ కూడా తన సూపర్ హీరోలే.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక 'ది మార్వెల్స్' సినిమా విషయానికి వస్తే.. నవంబర్ 10న ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది.