సమంత దానికి ఫిక్స్ అయ్యిందా?

సమంత తెలుగులో జానూ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా ఒప్పుకోలేదు. కారణాలు తెలియవు కానీ.. సమంత తాజాగా నటిస్తున్న తమిళ సినిమా నుండి కూడా [more]

Update: 2020-05-04 04:50 GMT

సమంత తెలుగులో జానూ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా ఒప్పుకోలేదు. కారణాలు తెలియవు కానీ.. సమంత తాజాగా నటిస్తున్న తమిళ సినిమా నుండి కూడా తప్పుకుంది అనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. ఆ విషయంపై స్పష్టత లేకపోయినా.. సమంత ఎందుకో సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఆ మధ్యన నందిని రెడ్డి తో సినిమా అన్నప్పటికీ…. నందిని రెడ్డి సమంత తో నేను సినిమా చెయ్యడం లేదని చెప్పింది. అలాగే కన్నడలో హిట్ అయిన దియా సినిమాని సమంత రీమేక్ చేస్తుంది అనే టాక్ ఉంది.

కరోనా లాక్ డౌన్ తో చైతు తో కలిసి సమయాన్ని గడుపుతున్న సమంత ఓ సినిమా చెయ్యబోతుందట. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ని ప్లాన్ చేస్తుందట. దానికోసం సమంత ని ఒప్పించడానికి సోని పిక్చర్స్ రంగంలోకి దిగి పనులు చక్కబెట్టిందట. అంతేకాకుండా ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుందట. దీనికోసం ఓ కొత్త దర్శకుడిని తీస్కోబోతున్నారట. ఇక లాక్ డౌన్ ముందే సమంత తో సోని పిక్చర్ ఒప్పందం చేసుకుని.. పనులన్నీ ముగించింది. లాక్ డౌన్ ముగియగానే.. ఈ సినిమ పట్టాలెక్కడం ఖాయమట. షూటింగ్ ఎప్పుడు మొద‌లైనా స‌రే, సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్ అట.

Tags:    

Similar News