సమీరాని అంత టార్చెర్ పెట్టారా?

తెలుగులో ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, చిరు తో ఓ సినిమా చేసినా హీరోయిన్ సమీరా రెడ్డి తర్వాత తెలుగులో హిట్స్ లేక బాలీవుడ్ కి చెక్కేసింది. [more]

Update: 2020-09-06 06:32 GMT

తెలుగులో ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, చిరు తో ఓ సినిమా చేసినా హీరోయిన్ సమీరా రెడ్డి తర్వాత తెలుగులో హిట్స్ లేక బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా అంతంత మాత్రంగానే కెరీర్ కొనసాగించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నా తర్వాత మళ్ళీ నటన మీద మోజుపడుతున్న సమీరా రెడ్డి తాజాగా సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. గతంలో టాలీవడ్ సినిమాలు చేసినప్పుడు ఎన్టీఆర్ – సమీరా రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ సోషల్ మీడియాలో నడిచింది. ఇక తాజాగా సమీరా రెడ్డి చేసిన క్యాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.

తాను బాలీవుడ్ ఫిలిమ్స్ లో నటిస్తున్నప్ప్పుడు తనకి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ఓ సినిమాలో కథ విన్నప్పుడు లిప్ లాక్ సన్నివేశం లేదు.. కానీ సెట్స్ మీద ఉన్నప్పుడు దర్శకుడు లిప్ లాక్ సన్నివేశం చెయ్యాలి అంటే… నేను చెయ్యను నాకిష్టం లేదు అంటే.. ఆ దర్శకుడు తనని బెదిరించాడని, నీ గత సినిమాలో నువ్వు లిప్ లాక్ సన్నివేశంలో నటించావు.. ఇందులో నటించడానికి ఏమైంది.. నటిస్తే నువ్ ఈ సినిమాలో ఉంటావ్.. లేదంటే లేదని బెదిరించాడని, అలాగే మరో హీరో కూడా నీతో కలిసి నటించడం చాలా బోరింగ్ అని డైరెక్ట్ గానే చెప్పేశాడని… ఇకపై నీతో కలిసి సినిమాలు చేయనని అన్నాడని… ఆ తర్వాత ఏ సినిమాలో తనను హీరోయిన్ గా తీసుకోలేదని సమీర తెలిపింది.

అయితే సమీరా తనని బెదిరించిన దర్శకుడు, హీరో పేరుని మాత్రం చెప్పలేదు. అలాగే బాలీవుడ్ లో నేపోటిజం ఉందని.. తనకి వచ్చిన అవకాశాలను స్టార్ కిడ్స్ కోసం లాగేసుకున్నారని, చేతివరకు వచ్చిన ఆఫర్స్ స్టార్ వారసుల కోసం లాక్కుపోయారని, సినిమా ఇండస్ట్రీలో జాగ్రత్తగా లేకపోతె ఇక అంతే అంటూ తనకి ఎదురైనా అనుభవాలని సమీరా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News