క్రేజీ రీమేక్ తో వస్తున్న సంపూర్ణేష్ బాబు
'మండేలా'.. తమిళంలో స్టార్ కమెడియన్ యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు
'మండేలా'.. తమిళంలో స్టార్ కమెడియన్ యోగి బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఓ గొప్ప మెసేజీ ఉంటుంది. ఆ మెసేజీ ప్రస్తుత తరానికి చాలా అవసరం. ఈ సినిమా తెలుగులో రీమేక్ చేశారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాడు.
నేటి రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఓ క్షురకుడి ఓటుకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు జరిగాయి అనేదే సినిమా కథ. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ లో రీమేక్ అవుతోంది. ఈ పొలిటికల్ సెటైర్‌లో నటుడు నరేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ పెట్టారు. వై నాట్ స్టూడియోస్ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.
పూజ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, C/O కంచరపాలెం దర్శకత్వం వహించిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యోగి బాబు మండేలా సినిమాకు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. అక్టోబర్ 27న విడుదలవుతున్న మార్టిన్ లూథర్ కింగ్ ను తెలుగు ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి.